తిరుమల లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్రైస్తవుడు అని లెక్క తేలిపోయింది. చర్చిలలో క్రమం తప్పకుండా క్రైస్తవ ప్రార్థనల్లో పాల్గొంటారని బయట పడింది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉంచాలని కొంతమంది తెర వెనుక నుంచి చక్రం తిప్పుతున్నట్లు సమాచారం.
….
తిరుమల తిరుపతి దేవస్థానం అంతటికీ ఎగ్జిక్యూటివ్ అధికారి .. సుప్రీం గా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటికీ ఎంత బడ్జెట్ ఉంటుందో,, కేవలం టీటీడీ కి అంతకు మించిన బడ్జెట్ ఉంటుంది. దీనిని బట్టి టీటీడీ అన్నది ఎంతటి పెద్ద వ్యవస్థో అర్థం చేసుకోవచ్చును. ఇంతటి వ్యవస్థను మేనేజ్ చేసే ఈవో కి దిగువన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లు వివిధ బాధ్యతలు చూస్తూ ఉంటారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దగ్గర జీతం మాత్రమే కాకుండా అనేక సౌకర్యాలు కూడా అనుభవిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల విద్య, వైద్యం, బీమా వంటి అనేక సేవలు కూడా పొందుతూ ఉంటారు. ఇవన్నీ కేవలం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి చలవే అని గుర్తు పెట్టుకోవాలి.
….
ఈ మాదిరిగా శ్రీ వారి భక్తులు సమర్పించిన కానుకల్లోంచి అన్ని సౌకర్యాలు తీసుకొంటున్న ఏఈవో ఆది రాజశేఖర్ బాబు వంటి అధికారులు… దారి తప్పి ప్రవర్తిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మీద భయం, భక్తి లేకుండా దర్జాగా క్రైస్తవ మత ప్రచారాల్లో పాల్గొంటున్నారు.
ప్రముఖ దినపత్రిక ఈనాడు కథనం ప్రకారం.. ఆది రాజశేఖర్ బాబు నూటికి నూరుపాళ్లు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారు. పుత్తూరు లోని చర్చి కాంపౌండ్ లోనే ఆయనకు స్వంత ఇల్లు ఉంది. అక్కడ చర్చిలో ఆదివారం నాడు కుటుంబంతో సహా ప్రార్థనల్లో పాల్గొంటూ ఉంటారు. వాస్తవానికి పుత్తూరు చర్చి అన్నది చాలా పాపులర్ అయింది. తిరుమల, తిరుపతి, చిత్తూరు, పుత్తూరు వంటి చోట్ల హిందువులకు రక రకాల మాయ మాటలు చెప్పి, మత మార్పిడిలు చేస్తున్న చర్చిలలో ఈ పుత్తూరు చర్చి కూడా ఒకటి. ఆ చర్చి భక్తుడిగా ఆది రాజశేఖర్ బాబు కూడా క్రైస్తవ మత మార్పిడులకు సహకరిస్తున్నారని స్థానికులు అంటున్నారు. ఈ ఆధారాలను సేకరించి నీలకంఠం అనే భక్తుడు.. టీటీడీ కి ఇప్పటికే ఒక ఫిర్యాదు కూడా అందించారని సమాచారం. కానీ దీని మీద ఎటువంటి చర్యలు తీసుకొన్నట్లుగా తెలియటం లేదు.
ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఆది రాజశేఖర్ బాబు … టీటీడీ లో ఏఈవో స్తాయి అధికారి. అంటే ఈవో గారి తర్వాత ఉండే అధికారుల్లో ఒకరు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి సంబంధించిన అనేక కీలక విషయాలలో నిర్ణయాలు తీసుకొంటూ ఉంటారు. అటువంటి వ్యక్తి కి స్వామి వారి మీద భయ భక్తులు లేవు అంటే ఏమనుకోవాలి. పైగా క్రైస్తవ మత మార్పిడులకు ఆయన సహకరిస్తున్నారు అంటే పరిస్తితి అర్థం చేసుకోవచ్చు.
………
వాస్తవానికి టీవీ 5 ఛైర్మన్ బీ ఆర్ నాయుడు తిరుమల తిరుపతి పాలకమండలి ఛైర్మన్ అయ్యాక అన్య మత ప్రచారం మీద ద్రుష్టి పెట్టారు. టీటీడీ లో కొందరు ఉద్యోగులు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారని గుర్తించారు. వారిని వేరే ప్రభుత్వ శాఖలకు పంపించటం మేలు అన్న ఆలోచన చేస్తున్నారు. కానీ ఇటువంటి నిర్ణయాలు అమలు కాకుండా తిరుపతి లోని కొన్ని రాజకీయ శక్తులు అడ్డు పడుతున్నట్లు సమాచారం. అన్యమత ప్రచారం చేస్తున్న టీటీడీ ఉద్యోగులకు రాజకీయ నేతల అండదండలు ఉండటం గమనార్హం. దీంతో ఈ విషయంలో టీటీడీ కూడా ఏమీ చేయలేక పోతోందని చెబుతున్నారు