ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్.
ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్ ఎంపికయ్యారు. బుధవారం సాయంత్రం 4.00 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న త్రివేంద్ర సింగ్ రావత్ పదవి నుంచి తప్పుకున్నారు. ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు.. బుధవారం ఉదయం డెహ్రాడూన్‌లోని బీజేపీ కార్యాలయంలో జరిగిన మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. త్రివేంద్ర సింగ్ రావత్‌పై పలు ఆరోపణలు రావడంతో ఆయన స్వయంగా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. కాగా, కొత్త ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ వయస్సు 56 ఏళ్లు.. 2013-15 మధ్య ఉత్తరాఖండ్ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. అంతేకాదు గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు.
BJP MP Tirath Singh Rawat to become new chief minister of Uttarakhand, announces Trivendra Singh Rawat who stepped down yesterday pic.twitter.com/DminB0gvRI
— ANI (@ANI) March 10, 2021