అదిలాబాద్ జిల్లా బోథ్ మండలములో పులి సంచారం వార్త కలకలం రేపుతోంది. దీంతో గత రెండు రోజులుగా అలజడి నెలకొంది.
అదిలాబాద్ జిల్లాలోని బోథ్ మండలంలోని చింతలబోరి చెరువు కి కొద్ది దూరంలో పెద్దపులి కనబడింది.
మంగళవారం రోజు అటవీ శాఖకి చెందిన అధికారులు చింతల బోరి చెరువు దాటగానే కొద్ది దూరం అడవుల్లోకి వెళ్ళగా అక్కడ పెద్దపులిని చూసి వెనుతిరిగారు. తర్వాత కొంతమంది సమీప గ్రామస్తులతో కలిసి వెళ్ళి పెద్ద పులిని చూసి అక్కడ నుండి వచ్చినట్లు సమాచారం.
పెద్దపులి సంచారం విషయమై అటవీ శాఖ అధికారులను వివరణ కోరగా పులి సంచరిస్తున్న మాట వాస్తవమేనని చెప్పారు . వజ్జార్ గుట్ట సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
బుధవారం మర్లపెళ్ళి గ్రామ సమీపాన చింతగుడా గ్రామాల్లో పెద్ద పులి కనిపించింది . దీంతో స్థానికులు కేకలు వేయడంతో అడవిలోకి వెళ్లినట్టు సమాచారం.
ప్రతి సంవత్సరం పులులు ఈ సమయములో వజ్జర్ గుట్టల్లోకి వస్తూ వెళుతూ ఉంటాయి.
వాటికి ఈ సమయములో
తిప్పేశ్వర్ అభయరణ్యము నుండి కవ్వాల్ అభయారణ్యం లోకి వెళుతూ ఉంటాయి.
తిప్పేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యం భారతదేశములో రెండు రాష్ట్రాల పరిధిలో ఉంది.
మహారాష్ట్ర,తెలంగాణ ల్లో విస్తరించి ఉంది.
ప్రస్తుతం అరణ్యాలు కొంత మేరకు అంతరించి వ్యవసాయ భూములు, నివాస ప్రాంతాలు కావడంతో వన్య ప్రాణులకు ఇబ్బంది ఏర్పడుతుంది. పులులు సంచరించడానికి అనుకూల వాతావరణం లేకపోవడం,, జాతీయ రహదారి అడ్డంకి మారడంతో బోథ్ పరిసర ప్రాంతాల్లోకి పెద్ద పులు వచ్చి తిరిగి తిప్పేశ్వర్ కి వెళ్ళిపోతున్నాయి.
ఇలా పెద్ద పులి బోథ్ ప్రాంతంలో సంచరించింది అని తెలవగానే బోథ్ పరిసర గ్రామాల ప్రజలు ఒకింత భయాందోళనలకు గురవుతున్నారు.
బుధవారం సాయంత్రం రెండ్ల పల్లిలో జెండా గుట్ట వద్ద, బాబేర తండా వాసి అయిన జాదవ్ దీలీప్ చేండ్లో చేస్తున్న సమయములో పెద్దపులి చూస్తూ వుండగానే ఎద్దు పైన దాడి చేసి చంపడం తో భయాందోళనకు గురి అవుతున్న ప్రజలు. ఈ సంఘటన ఆదివాసి పల్లెల్లో అలజడి రేకెత్తిస్తుంది.
ఇలా గుట్టల్లో ఉండే పులి ఇలా గ్రామ సమీపములోకి రావడం తో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వ్యవసాయ కూలీలు, పశువుల కాపరిలు జాగ్రత్తగా ఉండాలి అని అధికారులు సూచిస్తున్నారు.