వందేభారత్ రైలుపై దుండగుల దాడులు ఆగడం లేదు. బిహార్ కతిహార్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు రైలుపై రాళ్లు విసిరారు. న్యూజల్పాయ్ గురి నుంచి ప్రారంభమైన రైలు డకోలా- టెల్టా ప్రాంతానికి రాగానే రాళ్లదాడికి పాల్పడ్డారు. సీ 6 కోచ్ అద్దం పగిలింది. అయితే ప్రయాణీకులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. డిసెంబర్ 30నే ఈ రైలు ప్రారంభం కాగా… రెండ్రోజులకే వరుసగా రెండు రాళ్లదాడులు జరిగాయి. ఇది మూడోసారి. ఇటీవలే ప్రారంభమైన సికింద్రాబాద్- విశాఖ వందేభారత్ రైలు ప్రారంభానికి ముందే విశాఖలో కూడా ఆకతాయిలు రాళ్లు రువ్విన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై కసరత్తు చేస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.
https://twitter.com/ANI/status/1616698889272463360?s=20&t=ZuhmW3EvObn7Ds4AZeiaPw