బంగ్లాదేశ్ లోని దేవాలయాలను అపవిత్రం చేసిన నిందితులను అరెస్ట్ చేయాలంటూ అక్కడి హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. రెండు రోజుల క్రితం లాల్మోనిర్హత్ జిల్లా హతిబంధ సమీపంలో మూడు హిందూ ఆలయాల్లో పాలిథిన్ కవర్లో పెట్టిన గొడ్డు మాంసాన్ని వేలాడదీశారు దుండగులు. దీంతో స్థానికులు నిరసనకు దిగారు. స్థానిక హిందువులతో దిగి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేశారు. గెందుకూరి క్యాంపులోని శ్రీ రాధాగోవింద ఆలయం, కుతిపర కాళీ మందిరం, కాళీమందిరం, మొనీంద్రనాథ్ మందిరాల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారు. స్థానికుల ఫిర్యాదుతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పెద్దఎత్తున పోలీసుల్ని మోహరించారు. నిందితుల కోసం గాలింపు చేపట్టామని త్వరలోనే పట్టుకుంటామని స్థానికులు తెలిపారు. బంగ్లాదేశ్ హిందూ-బౌద్ధ-క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ నాయకురాలు కాజల్ దేబ్నాథ్ ఈ ఘటనను ఖండించారు. మైనార్టీల మనోభావాలను దెబ్బతీయడం సరికాదని ఆమె అన్నారు. దుర్గాపూజ సందర్భంగా కూడా సోషల్మాడియా వేదిగ్గా పలువురు దైవదూషణకు పాల్పడ్డారు. తరువాత ఓ గుంపు డజన్ల కొద్దీ ఇళ్లకు నిప్పుపెట్టింది.