జన చైనా వృద్ధచైనాగా మారుతున్న తరుణంలో దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. జనాభాను నియంత్రించే క్రమంలో ఒక్కబిడ్డ నిబంధనను కఠినంగా అమలుచేసిన ఆ దేశం ఇప్పుడు ఏకంగా ఒక్కోజంట కనీసం ముగ్గురినైనా కనాల్సిందేనంటోంది. ఈమేరకు అధికార కమ్యూనిస్ట్ పార్టీ ప్రతిపాదనకు ‘నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్’ స్థాయీసంఘం ఆమోదముద్ర వేసింది. ఇందుకోసం జనాభా, కుటుంబనియంత్రణ చట్టాన్ని సవరించింది. దేశంలో జననాల రేటు గణనీయంగా పడిపోతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది ఆ దేశం. 2016 ముందు వరకు కొన్నిదశాబ్దాలపాటు ఏకసంతాన విధానాన్ని కఠినంగా అమలుచేసింది చైనా. ఫలితంగా తలెత్తిన సంక్షోభాన్ని నివారించే క్రమంలో అనేక చర్యలు తీసుకుంటోంది.