బొగ్గు గనుల్లో బొగ్గు ఉంది కానీ థర్మల్ విద్యుత్ కేంద్రాలలో బొగ్గుకి కొరత ఏర్పడింది. దాంతో సగానికి పైగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు 50% విద్యుత్ ని ఉత్పత్తి చేస్తున్నాయి. ఢిల్లీ కి సంబంధించి ఒక్క రోజుకి సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నట్లు తెలుస్తున్నది.
ఢిల్లీ తో పాటు ఒరిస్సా, ఛత్తీస్ గఢ్,మహారాష్ట్ర, పంజాబ్,తమిళనాడు రాష్ట్రాలలో విద్యుత్ కోతలు తప్పేట్లు లేవు.
1. సగానికి పైగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు విదేశాలనుండి బొగ్గుని దిగుమతి చేసుకొని విద్యుత్ ని ఉత్పత్తి చేస్తున్నాయి.
2. ఇండోనేషియా ఇప్పటి వరకు ఒక టన్ను బొగ్గు కి గాను $60 డాలర్లు వసూలు చేసేది కానీ హఠాత్తుగా ధరలు పెంచేసి టన్ను కి $160 డాలర్లు అడుగుతున్నది అంటే టన్నుకి 100 డాలర్లు పెంచేసింది. దాంతో అంత ధర పెట్టి కొనలేని విద్యుత్ కేంద్రాలు మన దేశంలోని బొగ్గు గనుల మీద ఆధారపడడం మొదలుపెట్టేసరికి బొగ్గు కి తీవ్ర కొరత ఏర్పడింది.
3. సాధారణంగా ప్రతీ మూడు లేదా ఆరు నెలల ముందే బొగ్గుకి ఆర్డర్ చేస్తాయి విద్యుత్ సంస్థలు. కానీ ఇండోనేషియా ఒక్క సారిగా ధరలు పెంచే సరికి దిగుమతిని ఆపేసాయి.
4.ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత విద్యుత్ పేరుతో దుబారా చేస్తూ విద్యుత్ సంస్థల పైన తీవ్ర ఒత్తిడిని తెస్తున్నాయి తక్కువ ధరకి విద్యుత్ ఇవ్వమని పైగా తెర చాటు లంచాలు సరేసరి ! ఇప్పుడు ? బొగ్గు కొరత ఏర్పడగానే చేతులు ఎత్తేసి కేంద్రం వైపు చూడడం మొదలుపెట్టాయి.
5. మరి ముందు జాగ్రత్త తీసుకోలేదా ? ఎలా తీసుకుంటారు ? ప్రతి 45 రోజులకి రాష్ట్ర విద్యుత్ బోర్డులు విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాలకి చెల్లింపులు చేస్తుంటాయి కానీ గత కొంత కాలంగా మూడు నుండి 6 నెలల దాకా బకాయి పడ్డాయి రాష్ట్ర విద్యుత్ బోర్డులు. దాంతో చేతిలో డబ్బు లేక ముందు జాగ్రత్తగా బొగ్గుకి ఆర్డర్ ఇవ్వలేకపోయాయి. దాని ఫలితమే ఇప్పటి తీవ్ర బొగ్గు కొరత. వోట్ల కోసం ఉచితాలు ఇవ్వడం దేనికి ? దాని ఫలితంగా విద్యుత్ సంస్థలకి ఆలస్యంగా బిల్లులు క్లియర్ చేయడం దేనికి ? ఇప్పుడు బొగ్గు సరఫరా చేయమని కేంద్రం మీద ఒత్తిడి తేవడం ఎందుకు ?
6. 2019 లో సెప్టెంబర్ నెల కాలానికి 2021 సెప్టెంబర్ నెల కాలాని విద్యుత్ డిమాండ్ 35% పెరిగింది. అంటే 2019 కంటే 2021 కి ఎక్కువ డిమాండ్ ఉంది. కోవిడ్ తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఎకానమీ ఒక్క సారిగా పుంజుకోవడం తో ఆర్డర్లు ఎక్కువ అయి విద్యుత్ కి డిమాండ్ ఏర్పడ్డది. 2020 కి గాను కోవిడ్ వల్ల లెక్కలోకి తీసుకోలేదు.
7. ఇప్పటికే పంజాబ్ లో విద్యుత్ కోతలు మొదలయ్యాయి. లోడ్ షెడ్డింగ్ ని అమలు చేస్తున్నారు. పంజాబ్ లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. పంజాబ్ రైతులు ఇతర రాష్ట్రాల రైతులతో పోలిస్తే అత్యంత ధవంతులు కాబట్టి ఇకనయినా ఉచిత విద్యుత్ ఆపేస్తారా ? లేక ఎక్కువ ధరపెట్టి విదేశాలనుండి దిగుమతి చేసుకుంటారా ?
8. ప్రస్తుతానికి 7 రాష్ట్రాలు తీవ్ర విద్యుత్ కొరతని ఎదుర్కోబోతున్నాయి. భవిష్యత్తులో ఈ జాబితాలోకి మరిన్ని రాష్ట్రాలు చేరే అవకాశాలు ఉన్నాయి.
9. కేంద్రం ఇప్పటికే ఒక కోర్ కమిటీని ఏర్పాటు చేసి రోజువారీగా పరిస్థిని సమీక్షిస్తున్నది. కోల్ ఇండియా తో పాటు ఇండియన్ రైల్వేస్ తో కూడా రోజువారీగా సమీక్షలు చేస్తున్నది కోర్ కమిటీ . మొత్తం 135 థర్మల్ విద్యుత్ కేంద్రాలకి బొగ్గు సరఫరా చేయడానికి యుద్ధ ప్రాతిపదికన ఇండియన్ రైల్వేస్ వాగన్ లని సమకూరుస్తున్నది బొగ్గు సరఫరా కోసం.
10. గత నెలలో పడ్డ తీవ్ర వర్షాలకి బొగ్గు గనులలో నీరు చేరి తవ్వకాలకి ఆటంకం ఏర్పడ్డది. యుద్ధ ప్రాతిపదికన గనులలో ఉన్న నీరుని శక్తివంతమయిన పంప్ లతో బయటికి తొడిస్తున్నారు. బహుశా ఈ ప్రక్రియ ముగిసి మళ్ళీ బొగ్గు తవ్వకాలు మొదలవడానికి వారం పట్టవచ్చు అప్పటి వరకు విద్యుత్ కొరత తప్పదు.
11. సెకండ్ వేవ్ కోవిడ్ వచ్చినప్పుడు కేంద్రం ఆక్సీజెన్ ఇవ్వలేదని ఏడ్చిన వెధవలు ఇప్పుడు కూడా బొగ్గు మీద రాజకీయాలు మొదలుపెట్టారు. ప్రైవేట్ విద్యుత్ సంస్థలు 3 నెలలు ముందుగానే బొగ్గుకి ఆర్డర్ ఇవ్వాలి అలాగే నెల రోజులకి సరిపడా బొగ్గు నిల్వలు ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా వాటిదే. రాష్ట్ర విద్యుత్ బోర్డులు సకాలంలో బిల్లులు ఇవ్వకపోతే విద్యుత్ సంస్థలు ముందస్తుగా బొగ్గుని కొనలేవు ఇది ఒక దానితో ఇంకోటిగా ఉండే చైన్ లింకు.
12. విదేశాలనుండి బొగ్గు ఖరీదు ఎక్కవ అవగానే ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోకుండా ఇప్పుడు మన దేశ బొగ్గు గనుల నుండి బొగ్గు సరఫరా చేయమని అడగడం దేనికి ?
Courtesy : పార్థసారధి పోట్లూరి