ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ టీమ్ కు వేల కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయన్న మాట కలకలం రేపుతోంది. పార్లమెంటులో బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే.. లెక్కలతో సహా ఈ ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన వివరాలతో ట్వీట్లు కూడా చేశారు. అమెరికా సంస్థల నుంచి వచ్చిన వేల కోట్ల రూపాయల విరాళాలకు లెక్కలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు ఈ ఆరోపణలు చర్చనీయాంశం అయ్యాయి.
….
గతంలో బంగ్లాదేశ్ లోని కొన్ని సంస్థలకు యూ ఎస్ ఎయిడ్ సంస్థల నుంచి కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. ఈ విరాళాలతోనే అక్కడ అల్లర్లు రేపి, ప్రభుత్వాన్ని కూల్చేశారు. ఇప్పుడు.. అదే యూ ఎస్ ఎయిడ్ సంస్థ ల నుంచి కాంగ్రెస్ ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ కుటుంబానికి వేల కోట్ల రూపాయలు విరాళాల రూపంలో వచ్చి పడింది. ఈ మాదిరిగా వచ్చిన డబ్బులతో భారత్ లో కూడా తిరుగుబాటు చేయించాలని కుట్ర పన్నినట్లు చెబుతున్నారు. అంతిమంగా ప్రభుత్వ పెద్దలను తరిమేసి,భారత్ లో దొంగదారిన అధికారం చేజిక్కించుకునేందుకు ప్లాన్ చేశారని అంటున్నారు.
…
ఇందులో కాంగ్రెస్ పార్టీ విదేశీ వ్యవహారాల చీఫ్ శామ్ పిట్రోడా కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. శామ్ పిట్రోడా మరియు రాహుల్ గాంధీ బంధువులతో కలిసి కొన్ని స్వచ్చంద సంస్థలు స్థాపించారు. ఈ ఎన్జీవోలకు అమెరికా నుంచి యూఎస్ ఎయిడ్ సంస్థలు వేల కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. సరైన కారణం లేకుండా వేలకోట్ల రూపాయలు విరాళాలు వస్తుండటంపై అనుమానాలు కలుగుతున్నాయి. శ్యామ్ పిట్రోడా నిజానికి అమెరికా పౌరసత్వం మీద అక్కడ లాబీయింగ్ చేసేవారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో అక్కడ పౌరసత్వం వదిలేసి, ఇక్కడ ప్రభుత్వ సలహాదారు గా చేరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి ఇండియన్ ఓవర్సీస్ ఛైర్మన్ గా అవతరించారు.
…
ఒక వాదన ప్రకారం.. బంగ్లాదేశ్ మాదిరిగా భారత్లో కూడా అల్లర్లు రేపటమే ఈ సంస్థల లక్ష్యం అని తెలుస్తోంది. ఇక్కడ అల్లరిమూకలకు డబ్బులు పెట్టి పోషించి, దేశంలో అలజడి రేపే కుట్రలకు ప్రయత్నించారని సమాచారం. ఇందుకు తగినట్లుగా భారత్ లోని కొన్ని ఫేక్ ఎన్జీవోలకు కూడా అమెరికా నుంచి డబ్బులు వచ్చి పడ్డాయి అని అంటున్నారు.
….
ఇంత జరుగుతున్నా.. రాహుల్ గాంధీ టీమ్ మాత్రం ఈ విరాళాల గురించి నోరు మెదపడం లేదు. ఎన్ని వేల కోట్ల రూపాయలు వచ్చాయి, ఎందుకు ఖర్చు పెట్టారు అనేది స్పష్టం చేయటం లేదు. దీనిని బట్టి అనేక అనుమానాలు కలుగుతున్నాయి. మరో వైపు, బంగ్లాదేశ్ లో మాదిరి అల్లర్లు స్రష్టించటం భారత్ లో సాధ్యం కాదని కూడా చెప్పవచ్చు.