2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్..అమృత్ కాలానికి ఇది తొలి బడ్జెట్ అని ఆమె అన్నారు. ఇందులో 7 అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆమె ప్రకటించారు.
సమ్మిళిత వృద్ధి, మౌలిక సదుపాయాలు- పెట్టుబడులు, సామర్థ్యాల వెలికితీత
హరితవృద్ధి, యువశక్తి, చిట్టచివరి వ్యక్తికీ లబ్ది చేకూరడం, ఆర్థిక రంగం బలోపేతం అంశాలుగా బడ్జెట్ రూపకల్పన జరిగిందని ఆమె తెలిపారు.