క్షమాపణ ధ్రువీకరణ పత్రాలు అందించే నెపంతో తాలిబన్లు ఆఫ్గన్ పౌరులను వేధింపులకు గురిచేస్తున్నారని పౌరుల ఇళ్లు దోపిడీ చేస్తున్నారని ఆఘ్గనిస్తాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమృల్లా సాలేహ్ ఆరోపించారు. బుధవారం కూడా కాబూల్‌లోని కొందరి ఇళ్లల్లోకి తాలిబన్లు చొరబడి క్షమాపణ ధ్రువీకరణ పత్రాలు విక్రయిస్తున్నట్టు తనకు సమాచారం ఉందని ట్విట్టర్లో పేర్కొన్నారు.
“Every day we get evidential reports of Talib thugs entering homes of people in Kabul & other cities to sell hand written “pardon certificates”. The pardon certificates work until d turn of the next thug. This vicious cycle is forcing millions to leave. Pak’s gift to Afg ppl,” అంటూ ఉపాధ్యక్షుడు ట్వీట్ చేశారు.
తాలిబన్ల అరాచకాలకు పెద్దసంఖ్యలో ప్రజలు ఆఫ్గనిస్తాన్ నుంచి పారిపోతున్నారని… వేధింపులు, దోపిడీలు హెచ్చుమీరాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో ఇలాంటి పాలన, పరిస్థితులనే పాకిస్తాన్ కోరుకుందని అన్నారు. ఆఫ్గనిస్తాన్ ను పూర్తిగా నియంత్రణలోకి తీసుకున్న తాలిబన్లు ఆందోళన చెందుతున్న ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నంలో భాగంగా పలు చర్యలు తీసుకుంది. అందులో ఒకటి ఆమ్నెస్టీ సర్టిఫికెట్లు.
2021 ఆగస్టులో తాలిబన్ల మెరుపుదాడి తరువాత నెలకొన్న గందరగోళ పరిస్థితులు, ప్రపంచదేశాలనుంచీ తాలిబన్లకు పెద్దగా మద్దతు లేకపోవడంతో 1990 లనాటి పరిస్థితులు తలెత్తుతాయేమోనని భయపడి వేలాదిమంది దేశం విడిచి వెళ్లారు. అక్కడే ఉంటున్నవారూ ఇంకా ఆందోళనల్లోనే ఉన్నారు.
ఇక పాకిస్తాన్ తీరుపై ముందునుంచీ అసహనంతోనే ఉన్నారు అమ్రుల్లా సలేహ్ . ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న ఆ దేశం… ఆఫ్గనిస్తాన్ లోనూ తాలిబన్లకు అండగా ఉంటోందని పలుమార్లు ఆరోపించారు. ఆఫ్గనిస్తాన్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తరువాత కూడా పలు ఇంటర్వ్యూలు, చర్చల్లో స్వరం పెంచారు. ఆఫ్గన్ ఆర్మీకి మద్దతు ఇచ్చారు.
పాకిస్తాన్ తాలిబాన్ ఉగ్రవాదులకు సురక్షితమైన స్వర్గధామం .ఆ దేశం మొత్తం ఉగ్రవాద సంస్థల్ని ఎంటర్ టైన్ చేస్తోంది. ప్రోత్సాహకాల్ని అందించడం ద్వారా అమెరికా ఉగ్రవాద నిరోధానికి ప్రయత్నించింది. కానీ పాకిస్తాన్ తీరు ఏమాత్రం మారకపోగా తాలిబన్లకు మరింత అండగా నిలుస్తూ వస్తోందని అమ్రోహ్ ఆందోళన వ్యక్తం చేశారు.
Every day we get evidential reports of Talib thugs entering homes of people in Kabul& other cities to sell hand writen "pardon certificates". The pardon certificates work until d turn of the next thug. This vicious cycle is forcing millions to leave. Pak's gift to Afg ppl. 1/2
— Amrullah Saleh (@AmrullahSaleh2) November 10, 2021