పాక్ ఎంపీ తీరు ఇది.. 14 ఏళ్ల బాలికను పెళ్లాడాడట..!
పాకిస్తాన్ అంటేనే ఓ విలువలు లేని దేశమని జగమెరిగిన సత్యం. అయితే మరోసారి పాక్ తీరును ప్రపంచానికి తెలిసేలా చేశాడు ఆ దేశానికి చెందిన ఓ ఎంపీ. సభ్య సమాజం సిగ్గుపడేలా ఓ 14 ఏళ్ల బాలిక(మైనర్)ను వివాహమాడాడు. సదరు ఎంపీ తీరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. బలుచిస్తాన్కు చెందిన మౌలానా సలాహుద్దీన్ బలుచిస్తాన్ జాతీయ అసెంబ్లీకి సభ్యుడిగా ఉన్నాడు. అంతేకాదు.. జమియత్ ఉలేమా ఈ ఇస్లాం పార్టీకి నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు.
ఎంపీ వివాహం చేసుకున్న సదురు బాధిత బాలిక.. బలుచిస్తాన్ ప్రాంతంలోని జుగుర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతోంది. అయితే స్కూల్ రికార్డుల ప్రకారం.. సదరు బాలిక 2006 అక్టోబర్ 28వ తేదీన జన్మించినట్లు తెలుస్తోంది. స్కూల్ రికార్డుల ప్రకారం.. సదరు బాలిక వయస్సు పద్నాలుగు సంవత్సరాలంటూ.. స్థానిక మహిళా సంక్షేమ సంస్థ పేర్కొంది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు బాలిక పెళ్లి విషయంపై దర్యాప్తు చేపడుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు బాలిక తల్లిదండ్రులను కలిసి విచారణ చేపట్టగా.. తాము తమ బాలికకు పెళ్లి చేయలేదంటూ అఫిడవిట్ సమర్పించారు.