ఏ దేశంలోనూ జాతీయ భద్రత మీద ముఖ్య రాజకీయ పక్షాలు రాజకీయం చేయరు. చూడండి ఇజ్రెయేల్ లో ప్రధాని మారినా భద్రత విషయంలో పాత ప్రభుత్వ పంథాను అనుసరిస్తున్నారు..కానీ అదేం దరిద్రమో మన దేశంలో ముఖ్య పార్టీలు అయిన కాంగ్రెస్, కమ్యూనిస్టు లు, కొన్ని ప్రాంతీయ పార్టీలు జాతీయ భద్రత విషయంలో తాము అధికారంలో ఉంటే ఒక లాగా తాము ప్రతిపక్షం లో ఉంటే ఒక లాగా ప్రవర్తిస్తున్నారు.
ఉదాహరణలు చూడండి.
1. నక్సలిజం :
యూపీఎ అధికారంలో ఉన్నప్పుడు నక్సలిజమే జాతీయ భద్రతకు పెను ముప్పు అని అప్పటి మన్మోహన్ గారు అంటే
ఢిల్లీ లో JNU విద్యార్థులు ఆందోళన చేస్తే పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తే అప్పటి హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే మాట్లాడుతూ ఈ రోజు తాను ఇక్కడ విద్యార్థులను కలిస్తే రేపు అక్కడ అడవిలో నక్సల్స్ ని కలవ వలసి ఉంటుంది అన్నాడు.
2011 లో అప్పటి హోమ్ మంత్రి చిదంబరం దేశానికి టెర్రరిజం కంటే నక్సలిజమే పెను ప్రమాదం అని అన్నాడు.
ఇప్పుడు బిజెపి అధికారంలో ఉంది కాబట్టి ఇదే కాంగ్రెస్ ఇప్పుడు నక్సల్ సానుభూతి పరులు స్టాన్ సామి, వరవర రావు, JNU విద్యార్థుల వంటి వాళ్ళను వెనకేసుకు వస్తోంది.
కానీ బిజెపి ది ఆ రోజూ ఈ రోజూ కూడా ఒకటే మాట, నక్సలిజం జాతీయ భద్రతా సమస్య క్రిందే చూస్తోంది.
2. ఇక ఇస్లాం తీవ్రవాద సమస్య :
2011లో అప్పటి హోమ్ మంత్రి చిదంబరం హైదరాబాద్ బాంబు బ్లాస్ట్స్ తరువాత మాట్లాడుతూ దేశంలో సిమి నిషేధింపబడిన తరువాత వాళ్లే ఇండియన్ ముజాహిదీన్ పేరుతో మళ్ళీ తయారయ్యారు అని చెప్పాడు. అప్పుడు కూడా ఇస్లామిక్ టెర్రరిస్టులను గుజరాత్ ప్రభుత్వం ఎన్కౌంటర్ చేస్తే బిజెపి ప్రభుత్వం అమాయక ముస్లిమ్స్ ని చంపింది అని ఆ రాష్ట్ర పోలీసులపై కేసు పెట్టి జైల్లో పెట్టింది. ఆ పోలీసు అధికారులు 7 సం.లు జైల్లో ఉన్న తరువాత ఆ కేసు తప్పు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పాక పోలీసులు బయట పడ్డారు
2009 లో రాహుల్ గాంధీ అమెరికన్ అంబాసిడర్ తో మాట్లాడుతూ భారత్ కి ఇస్లామిక్ తీవ్రవాదం కన్నా హిందూ తీవ్రవాదమే ప్రమాదం అని సెలవిస్తే..
ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరో అడుగు ముందుకు వేసి అసలు 26/11న ర ముంబై లో జరిగిన పేలుళ్లు RSS పని అని చెప్పి పాక్ టెర్రరిస్టులకు క్లీన్ చిట్ ఇచ్చాడు.
2008 లో ఢిల్లీలో బాట్ల ఎన్కౌంటర్ లో శర్మ అని ఒక పోలీసు అధికారి చనిపోతే స్పందించని కాంగ్రెస్ , దానిలో ఇద్దరు టెర్రరిస్ట్ లు చనిపోతే అమాయక టెర్రరిస్టులు చనిపోయారని సోనియా కన్నీళ్లు పెట్టుకున్నారుట, ఆ పోలీసులు మీద కేస్ కూడా పెట్టారు. ఆ ఎన్కౌంటర్ నిజమే అని మొన్న మార్చి నెలలో కోర్టు తీర్పు ఇచ్చి పోలీసులపై కేసు కొట్టేసింది.
అలాగే JKLF తీవ్రవాదులతో చెట్టాపట్టాల్. అర డజను మంది IAF అధికారులును చంపిన కేసు ఎదుర్కొంటున్న JKLF నాయకుడు యాసిన్ మాలిక్ ని చర్చల పేరుతో నెత్తిన ఎక్కించుకున్నారు ప్రధాని మన్మోహన్. శాంతి కోసం పాక్ టెర్రరిస్టులతో మాట్లాడే అవకాశం ఇప్పించమని మన్మోహన్ ఈ మాలిక్ ని కోరారట
ఇకపోతే పార్లమెంట్ మీద దాడి కేసులో అర్ధరాత్రి కూడా విచారణలు జరిపి సుప్రీంకోర్టు ఆఫజల్ గురుకి మరణ శిక్ష ఖరారు చేసి UPA హయాంలోనే ఉరి తీస్తే ఇప్పుడు మాజీ హోమ్ మంత్రి చిదంబరం అంటాడు ఆఫజల్ గురు విషయం లో తప్పు జరిగి ఉండవచ్చు అంటున్నాడు. వీడు దేశానికి హోమ్ మంత్రిగా చేసాడు. వీళ్ళ చేతుల్లో దేశ భద్రత ఎలా ఉంటుంది?
ఇస్లామిక్ తీవ్ర వాదం మీద బిజెపి ది అప్పుడూ ఇప్పుడూ ఒక్కటే వైఖిరి.
3. ఇక సిపిఎం వైఖరి చూడండి.
2010లో అప్పటి కేరళ ముఖ్యమంత్రి సిపిఎం సీనియర్ నేత VS అచ్యుతానందన్ మాట్లాడుతూ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అంటే PFI కేరళను ముస్లిం రాజ్యంగా మార్చాలి అని చూస్తోంది అని ఆరోపించాడు. ఇప్పుడు అదే సిపిఎం కేరళలో, తమిళనాడు లో, కర్ణాటక లో లోపాయికారి వప్పొందాలు, ఉగ్రవాద కార్యకలాపాలపై PFI సభ్యులను కేంద్రం అరెస్ట్ చేస్తే వారిని వెనకేసుకు రావడాలు.
PFI, SIMI, IM విషయం లో అప్పుడూ ఇప్పుడూ బీజేపీ వైఖరి ఒక్కటే.
4. ఇక త్రిణమూల్ కాంగ్రెస్ చూడండి
బంగ్లాదేశ్ బోర్డర్ రాష్ట్రం అయిన బెంగాల్ లో కమ్యూనిస్టు లు అధికారంలో ఉన్నప్పుడు మమత బాంగ్లాదేశ్ అక్రమవలసదారులపై నానా యాగీ చేసి పార్లమెంట్ లో గొడవ గొడవ చేసింది.
వాళ్ల ఓట్లు వల్లే కమ్మీలు అధికారంలోకి వస్తున్నారు అంది, దేశ భద్రతకు ప్రమాదం అంది. కానీ ఆ ఓట్లే గెలవడానికి ముఖ్యం అని తెలుసుకున్న దగ్గర నుండి తాను అధికారంలోకి రావడానికి జాతీయ భద్రతా పణంగా పెట్టి ఆ అక్రమవలదారుల విషయంలో పూర్తి యూ టర్న్ తీసుకొని అధికారంలోకి వచ్చి వారిని మరింత బుజ్జగించి ప్రోత్సహిస్తోంది.
బిజెపి ది ఈ విషయంలో అప్పుడూ ఇప్పుడూ ఒకటే స్టాండ్.
ఇక శివసేన మరో ప్రాంతీయ పార్టీ వైఖరి చూడండి. బిజెపి తో దోస్తీ ఉన్నంత కాలం ఇస్లామీక్ టెర్రరిజం, బంగ్లాదేశ్, రోహింగ్య అక్రమవలసదారుల విషయాలపై నానా గొడవ చేసి అధికారం కోసం బిజెపి ని వదలి కాంగ్రెస్, ఎన్సీపీ సెక్యూలర్ గ్యాంగ్ పక్కన ఎప్పుడు చేరిందో జాతీయ భద్రతా విషయం గాలికి వధలి ఇప్పుడు అసలు ఆ ఇష్యూస్ మీద మాట్లాడటమే లేదు. ఇది ఆ పార్టీకి జాతీయ భద్రత మీద వున్న శ్రద్ధ.
జాతీయబధ్రత విషయంలో, టెర్రరిజం విషయంలో ఈ ద్వంద ప్రమాణాల వల్లే 2004-14మధ్య దేశంలో బాంబు పేలని పెద్ద నగరం లేదు. వీరి స్వార్ధ రాజకీయాలు వల్ల వందల మంది అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు.
ఈ ప్రతిపక్షాలు తమ రాజకీయ అవసరాల కోసం జాతీయ భద్రతని కూడా పణంగా పెడుతున్నారు. అందుకే యూపీఏ అ
ధికారంలో ఉన్నప్పుడు దేశంలో బాంబులు పేల్చేవారికి పాక్ ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నా పాక్ కి ఏ ఇబ్బంది లేక హాయిగా ఉండి భారత్ లో ఉగ్రవాద శక్తులను మరింత ప్రోత్సహించేది
…చాడా శాస్త్రి..