నిన్నటి నుంచి సోషల్మీడియా లో వైరల్ అవుతోందీఫొటో. ఆఫ్గన్లో ప్రస్తుత పరిస్థితికి నిలువెత్తు నిదర్శనం ఈ చిత్రం. ఆఫ్గన్ పూర్తిగా తాలిబన్ల వశం కావడంతో పౌరులు ప్రాణాలుఅరచేత పట్టుకుని దేశంనుంచి పారిపోతున్నారు. పెద్దెత్తున జనం కాబూల్ విమానాశ్రయానికి తరలివచ్చి అక్కడున్న విమానాలు ఎక్కేశారు. అవి ఎక్కడికి వెళ్తున్నాయో ఏదేశానివో వాళ్లకి తెలీదు. వారికి కావల్సింది ఆ దేశాన్ని వీడడం.అలా కాబూల్ విమానాశ్రయం నుంచి బయల్దేరే ఈ అమెరికా విమానంలో 640మంది ఎక్కి కూర్చున్నారు. రద్దీ పెరగడంతో ఎయిర్ పోర్ట్ గేట్లు మూసివేశారు. అయినా ప్రహారీలు దూకి మరీ చొచ్చుకొచ్చారు. కిక్కిరిసిన ప్రయాణీకులతో విమానం రైలు జనరల్ బోగీని తలపించింది.