పీవోకే పై కీలక వ్యాఖ్యలు చేశారు ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్. పాక్ అక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకునేందుకు ఇదే అనువైన సమయం అన్నారాయన. పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు అన్నివిధాలా బలహీనంగా ఉందని… ఇంతకుమించి అవకాశం మనకు దొరదన్నారు రావత్. పీవోకేను స్వాధీనం చేసుకునేందుకు తమ సైన్యం పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉందని ఇటీవలే ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్విదేది వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ద్వివేది వ్యాఖ్యలపైనా స్పందించిన పాక్ ఆర్మీ కొత్తచీఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునిర్ సైతం బదులిచ్చారు.