ఆ చేప ఖరీదు 17 వేలు..అవును అక్షరాలా పదిహేడువేలు..ఓ క్వింటా ఉంటుందా అనుకుంటున్నారా అస్సలు కాదు..కిలో ఉంటదేమో..కిలో చేపకు అంతధరేంటీ అంటే అది మామూలు చేప కాదు..పులస మరి…..
పుస్తె అమ్ముకునైనా పులసచేప తినాలన్నది ఓ నానుడి.
దాన్ని నిజం చేస్తూ పదిహేడు వేలకు వేలంపాటలో పులసను దక్కించుకున్నాడొకరు. ఆ వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.
వర్షాకాలంలో మాత్రమే వచ్చే పులసకోసం గోదారోళ్లు ఎదురుచూస్తుంటారు. జూలై, ఆగస్ట్ నెలల్లో పడే ఈ పులస కోసం ముఖ్యంగా తూర్పుగోదావరి,యానాంవాసులు ఎగబడిపోతారు. ఎంతైనా పెట్టి కొంటారు..
అయినా వరదలొచ్చిన మొదటి వారంలోనే 17,000 అంటే, వర్షాకాలం చివరికొచ్చేసరికి లక్షల్లో పలుకుద్దేమో అని గుసగుసలు పోతున్నారు అక్కడోళ్లు..
యానాంకు గోదారి వరద నీరొచ్చి మూడ్రోజులే కదరా అయ్యింది.. ఈలోగా పడక పడక ఓ పులస పడితే,
దాన్ని కళ్ళు బైర్లుగమ్మే రేటుకి అమ్మేశారు కదరా అనీ అనుకుంటున్నారు..