ఝాన్సీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మహిళా మారథాన్ లో గందరగోళం నెలకొంది. మారథాన్ కు హాజరైన మహిళలు, విద్యార్థులు కాంగ్రెస్ పార్టీని, పార్టీ నాయకురాలు ప్రియాంకను దుమ్మెత్తి పోశారు. కారణం ముందుగా అనౌన్స్ చేసిన బహుమతులను వారికి ఇవ్వకపోవడమే.
యూపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న వేళ రాష్ట్ర కాంగ్రెస్ ఝాన్సీలో మహిళా మారథాన్ నిర్వహించింది. ముఖ్య అతిథిగా ప్రియాంక వాద్రా గాంధీ హాజరయ్యారు. అయితే మారథాన్ లో విజేతలకు, అలాగే పాల్గొన్నవారికీ స్మార్ట్ ఫోన్లు ఇస్తామని నిర్వాహకులు హామీ ఇచ్చారు. దీంతో పెద్దసంఖ్యలో మహిళలు, యువతులు, విద్యార్థినులు 2 కిలో మీటర్ల మారథాన్లో పాల్గొన్నారు. అయితే మారథాన్ పూర్తయ్యాక ఎలాంటి బహుమతులు ఇవ్వకుండానే నిర్వాహకులు, పార్టీ నాయకులు ఎక్కడివాళ్లడకు వెళ్లిపోయారు. వాలంటీర్లు మాత్రం వాళ్ల చేతిలో బిస్కట్లు, అరటిపండ్లు పెట్టి ఇంటికివెళ్లిపొమ్మన్నారు. దీంతో యువతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మార్ట్ ఫోన్ లు ఇస్తామని బిస్కట్లు చేతిలో పెట్టారని మండిపడ్డారు. ఈ మారథాన్లో నేషనల్ మెడలిస్ట్ జీనూయాదవ్ సహా పలువురు అథ్లెట్లూ ఇందులో పాల్గొన్నారు. తామేం గతిలేక అంత పొద్దున్నే రాలేదని..కిలోమీటర్లు పరుగెత్తించి చేతిలో బిస్కట్లు పెడ్తారా అని నిలదీశారు. విజేతలైన వారికి టూవీలర్లు, స్మార్ట్ ఫోన్లు ఇస్తామని తీరా ఎక్కడివాళ్లక్కడ వెళ్లిపోయారని జీనూ యాదవ్ సహా మారథాన్ విజేతలూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ, ప్రియాంక గాంధీ ఇలా ఇంతమందిని చీట్ చేస్తారని అనుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.