సంక్షేభంలో కొట్టుమిట్టాడుతున్న పొరుగుదేశం శ్రీలంకకు భారత్ ఆపన్నహస్తం అందించిన సంగతి తెలిసిందే. బియ్యం, పెట్రోల్, డీజిల్, బియ్యం, మందులు వంటివాటిని పెద్దమొత్తంలో ఇప్పటికే పంపించింది. అయితే సకాలంలో ఆదుకున్నారంటూ మోదీకి అక్కడినుంచి కృతజ్ఞతలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా శ్రీలంక కెప్టెన్ జయసూర్య మోదీకి ధన్యవాదాలు తెలిపారు. శ్రీలంకలో తాము చాలా కష్టాలు పడుతున్నామని…పొరగున ఉన్న భారత్ పెద్దన్నలా మాకు అభయహస్తం ఇస్తోంది. ఇందుకు భారత ప్రభుత్వానికి, మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు అని జయసూర్య మెసేజ్ పంపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)