మొదటిసారిగా 33 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించింది అధికార టీఆర్ఎస్. అందులో 19 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ముగ్గురు జడ్పీ చైర్ పర్సన్ లు, ముగ్గురు ఎంపీలున్నారు.వారి పేర్లను కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా త్వరలో ప్రకటించనున్నట్టు తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి కేసీఆర్ జిల్లా పర్యటనలకు వెళ్తారన్న వార్తల నేపథ్యంలో… జిల్లా అధ్యక్షుల పేర్లను ప్రకటించారు. జిల్లా స్థాయిలో 27 మంది ప్రజాప్రతినిధులను పార్టీ చీఫ్లుగా నియమించడం ఇదే మొదటిసారి.
కొత్త పార్టీ అధ్యక్షుల వివరాలు :-
ఆదిలాబాద్ – జోగు రామన్న(ఎమ్మెల్యే)
కొమురం భీమ్ ఆసిఫాబాద్ – కోనేరు కోనప్ప(ఎమ్మెల్యే)
మంచిర్యాల – బాల్క సుమన్(ఎమ్మెల్యే)
నిర్మల్ – జి.విఠల్ రెడ్డి(ఎమ్మెల్యే)
నిజామాబాద్ – ఏ . జీవన్ రెడ్డి(ఎమ్మెల్యే)
కామారెడ్డి – యం.కె. ముజీబుద్దీన్ (మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్)
కరీంనగర్ – జి.వి. రామకృష్ణారావు , ఛైర్మన్ , సుడా
రాజన్న సిరిసిల్ల – తోట ఆగయ్య , మాజీ ఎంపీపీ
జగిత్యాల – కె . విద్యాసాగర్ రావు(ఎమ్మెల్యే)
పెద్దపల్లి – కోరుకంటి చందర్(ఎమ్మెల్యే)
మెదక్ – యం పద్మా దేవెందర్ రెడ్డి(ఎమ్మెల్యే)
సంగారెడ్డి – చింతా ప్రభాకర్ (మాజీ ఎమ్మెల్యే)
సిద్దిపేట – కొత్త ప్రభాకర్ రెడ్డి(ఎంపీ)
వరంగల్ – అరూరి రమేష్(ఎమ్మెల్యే)
హనుమకొండ – దాస్యం వినయ్ భాస్కర్(ఎమ్మెల్యే)
జనగామ – సంపత్ రెడ్డి(జెడ్పీ ఛైర్మన్)
మహబూబాబాద్ – మాలోతు కవిత నాయక్(ఎంపీ)
ములుగు – కుసుమ జగదీశ్(జెడ్పీ చైర్మన్)
జయశంకర్ భూపాలపల్లి – గండ్ర జ్యోతి(జెడ్పీ చైర్మన్)
ఖమ్మం – తాతా మధుసూదన్(ఎమ్మెల్యే)
భద్రాద్రి కొత్తగూడెం – రేగా కాంతారావు(ఎమ్మెల్యే)
నల్గొండ – రమావత్ రవీంద్ర కుమార్(ఎమ్మెల్యే)
సూర్యాపేట – బడుగుల లింగయ్య యాదవ్(ఎంపీ)
యాదాద్రి భువనగిరి – కంచర్ల రామకృష్ణా రెడ్డి , ఛైర్మన్ , ఆయిల్ ఫెడ్
రంగారెడ్డి – మంచిరెడ్డి కిషన్ రెడ్డి(ఎమ్మెల్యే)
వికారాబాద్ – మెతుకు ఆనంద్(ఎమ్మెల్యే)
మేడ్చల్ – శంభీపూర్ రాజు(ఎమ్మెల్సీ)
మహబూబ్ నగర్ – సి . లక్ష్మారెడ్డి(ఎమ్మెల్యే)
నాగర్ కర్నూల్ – గువ్వల బాలరాజు(ఎమ్మెల్యే)
జోగులాంబ గద్వాల – బి . కృష్ణమోహన్ రెడ్డి(ఎమ్మెల్యే)
నారాయణపేట – ఎస్ . రాజేందర్ రెడ్డి(ఎమ్మెల్యే)
వనపర్తి – ఏర్పుల గట్టుయాదవ్(మున్సిపల్ ఛైర్మన్)
హైదరాబాద్ – మాగంటి గోపినాధ్(ఎమ్మెల్యే)