కర్ణాటకలో మొదలైన హిజాబ్ కేసుకు తుది తీర్పు వెల్లడించింది కర్ణాటక హైకోర్టు. హిజాబ్ ధరించి స్కూల్లోకి రావడం తప్పనిసరి కాదని.. ఇస్లాంలోనూ హిజాబ్ ధరించాలన్న నిబంధన లేదని తేల్చి చెప్పింది. విద్యాసంస్థల ప్రోటోకాల్ అనుసరించాల్సిందేనని.. రాజ్యాంగపరంగా అందరూ సమానమేనని చెప్పి.. హిజాబ్ పై దాఖలైన పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది. హిజాబ్ తీర్పు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. ఉడుపి జిల్లాలో ముందుగానే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా కర్ణాటక సర్కారు చర్యలు తీసుకుంటోంది.
ఉడుపిలో కొందరు విద్యార్థినులు హిజాబ్ ధరించి స్కూల్ లోకి రావడం వల్ల ఇదంతా మొదలైంది. హిజాబ్ తమ మత హక్కు అని, దాన్ని ధరించే స్కూల్లోకి వస్తామని పట్టు పట్టారు. స్కూల్ యూనిఫామ్ అనేది సమానత్వాన్ని పెంపొందించడానికి రూపొందించిందని .. యూనిఫామ్ ధరించి మాత్రమే స్కూల్లోకి రావాలని యాజమాన్యం ఘాటుగా చెప్పడంతో వివాదానికి తెరలేపారు. హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)