మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దేశ జనాభాను పెంచుకోవలసిన అవసరం ఉంది అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్.. సర్ సంఘ ఛాలక్ డాక్టర్ మోహన్ జీ భాగవత్ అన్నారు. ఇందుకు సంబంధించిన శాస్త్రీయమైన వివరాలను కూడా ఆయన వెల్లడించారు. ముఖ్యంగా యువత ఈ విషయంలో అవగాహన పెంచుకోవాలి అన్ని ఆయన సూచించారు.
నాగపూర్లో ఆర్ఎస్ఎస్ నిర్వహించిన ‘ కథ లే కుల్ సమ్మేళన్ ” కార్యక్రమంలో మోహన్ భాగవత్ మాట్లాడుతూ కుటుంబాల వైశిష్ట్యం గురించి వివరిస్తూ సమాజంలో సంతానోత్పత్తి రేటు 2.1 శాతం కంటే తక్కువగా ఉంటే ఆ సమాజం ఎలాంటి సంక్షోభం అవసరం లేకుండానే అదృశ్యమవుతుందని ఆధునిక జనాభా శాస్త్రం చెబుతోందని హెచ్చరించారు.
ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి. 1998 లేదా 2002లో భారత జనాభా విధానం రూపొందిందని, 2.1 శాతం కంటే సంతానోత్పత్తి పడిపోకుండా చూడాల్సిన అవసరాన్ని కూడా గుర్తించిందని చెప్పారు. 2021లో విడుదలైన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డేటా ప్రకారం గర్భనిరోధక రేటు 54 శాతం నుంచి 67 శాతానికి పెరుగుతుండగా, పూర్తి సంతాన శాతం (టిఎఫ్ఆర్) రేటు 2.2 నుంచి 2 కు క్షీణించిందని వివరించారు.
జనాభా తగ్గుదల వల్ల వచ్చిన కష్టాలను డాక్టర్ మోహన్ జి వివరించారు. జనాభా తగ్గడం వల్ల అనేక భాషలు, సమాజాలు ఇప్పటికే ఉనికి కోల్పోయాయని ఆయన గుర్తు చేశారు. ‘‘జనాభా శాస్త్రం ప్రకారం జనాభా పెరుగుదల రేటు 2.1 కన్నా దిగువకు వెళ్తే సమాజం నశిస్తుందని చెబుతున్నారు. దానిని ప్రత్యేకంగా ఎవరూ అంతం చేయాల్సిన అవసరం ఉండదు. భారత జనాభా విధానం కూడా జననాల రేటు 2.1 కన్నా తక్కువ ఉండకూదని చెబుతుంది. పైగా మన దేశానికి సంబంధించినంత వరకు ఈ రేటు 3 ఉండాలని సూచిస్తున్నారు. మన సమాజం మనుగడకు ఇది అవసరం” అని డా. భగవత్ స్పష్టం చేశారు.
దీని ప్రభావం అనేక ప్రాంతాల మీద ఉందని ఆయన చెప్పారు. 1960 … 2000 మధ్య రెట్టింపైన ప్రపంచ జనాభా పెరుగుదల రేటు ఆ తరువాత నుంచి తగ్గుముఖ పడుతోందని నివేదికలు చెబుతున్నాయి. ప్రతి మహిళ 2.1 మందిని కంటేనే పాతతరాన్ని భర్తీ చేసే స్థాయిలో జననాలు జరుగుతాయి. దీన్ని జనాభా భర్తీ రేటు అంటారు. ప్రతి మహిళ 2.1 రేటులో పిల్లలని కంటేనే జనాభా భర్తీ జరుగుతుందని చెబుతూ 2.1 కి దరిదాపు రేటులో ఉన్న దేశాల్లో భారత్, అర్జెంటీనా, ట్యునీసియా ఉన్నాయని ఆయన తెలిపారు. 2.1 కన్నా తక్కువ రేటు కలిగిన దేశాల్లో అమెరికా, బ్రెజిల్, మెక్సికో, చైనా, జపాన్, దక్షిణ కొరియా ఉన్నాయని వివరించారు.
ఈ విషయాలను యువత అర్థం చేసుకోవాలి అని డాక్టర్ మోహన్ జి భాగవత్ వివరించారు. లైఫ్ సైన్సెస్ లో శాస్త్ర వేత్త అయిన డాక్టర్ మోహన్ జి విశ్లేషణ మీద చర్చ జరుగుతున్నది.