ప్రముఖ నటుడు మోహన్ బాబు ఇంట్లో విభేదాలు భగ్గుమన్నాయి. మోహన్ బాబుకు మొదటి భార్య ద్వారా మనోజ్ మరియు లక్ష్మీ ప్రసన్న సంతానం. ఇద్దరినీ మొదటినుంచి దూరంగా పెట్టి చదివించారు. మొదటి భార్య చెల్లెల్ని రెండో పెళ్లి చేసుకున్న మోహన్ బాబు హైదరాబాద్ ఫిలింనగర్ లో ఉంటున్నారు. ఈ దంపతుల కుమారుడు విష్ణుని గారాబంగా పెంచారు. తర్వాత కాలంలో పిల్లలు ముగ్గురు సినీ రంగంలో ప్రవేశించి, వేరే వ్యాపారాలు చేసుకుంటూ ఎదుగుతున్నారు .
ఇక్కడే మరో విషయం కూడా గమనించాలి. కమ్మ కులస్తులైన మోహన్ బాబు ఇద్దరు కొడుకులు .. రెడ్డి సామాజిక వర్గం అమ్మాయిలని పెళ్లి చేసుకున్నారు.
ఇందులో ఒకరు వైసిపి కుటుంబం కాగా, మరొకరు తెలుగుదేశం కుటుంబం నుంచి వచ్చినవారు. రెండు కుటుంబాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. సయోధ్య చేయడానికి మోహన్ బాబు దంపతులు ప్రయత్నించినా,, వర్కౌట్ కాలేదు. ఈ క్రమంలో అంత తలో ఇంట్లో నివాసం ఉంటున్నారు. కానీ పని మనుషుల ద్వారా సమాచారం ఒక చోట నుంచి ఒక చోటకి పాకి పోతూ,,, విభేదాలు తీవ్రమైపోయాయి.
ఈ సంగతి తెలుసుకొని ఒక పనిమనిషిని మంచు విష్ణు కొట్టడంతో గొడవ మొదలైంది. ఆ తర్వాత మంచు విష్ణు దంపతుల్ని మోహన్ బాబు కొట్టించారు అన్న మాట వినిపించింది. ఈ క్రమంలో మోహన్ బాబు వైపు పెద్దకొడుకు మనోజ్ నిలబడగా,, భార్యతో సహా రెండో కొడుకు విష్ణు వాళ్లకు ప్రత్యర్థైపోయాడు. ఒకరి మీద ఒకరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోన్నారు. ఈ విషయంలో మీడియా కూడా ఇరుక్కునిపోయింది.
మోహన్ బాబు, మనోజ్, విష్ణు మధ్య మూడు ముక్కలాట నడుస్తుంటే.. మంచు లక్ష్మీ ప్రసన్న ఎవరి వైపు అన్న ప్రశ్న వినిపిస్తోంది. సినిమా ఫంక్షన్ ల లో చిత్రమైన తెలుగు మాట్లాడుతూ సందడి చేసే లక్ష్మీ ప్రసన్న … ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అవడం ఆసక్తిగా నిలుస్తుంది.