భారతదేశంలో ఆకర్షించేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం సర్ సంఘఛాలక్ డాక్టర్ మోహన్ జీ భాగవత్ అభిప్రాయపడ్డారు. ఇందుకు సుదీర్ఘకాలంగా కృషి జరిగింది అని ఆయన విశ్లేషించారు. సంఘ్ శతాబ్దం సమయం.. వ్యాఖ్యాన మాల శీర్షికన రెండో రోజు కార్యక్రమంలో ఆయన అనేక విషయాలను ప్రస్తావించారు.
వ్యక్తిత్వ నిర్మాణం, కుల మత వివక్షలకు అతీతంగా సమరసత, ప్రపంచాన్ని స్థిరత్వం మరియు నైతిక బలం వైపు నడిపించగల ఆదర్శ సమాజంగా భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి అందరం సమష్ఠిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
రెండవ రోజు సమావేశంలో భాగవత్జీ ప్రసంగంలోని ప్రధానాంశాలు ఈ విధంగా ఉన్నాయి.
నేడు సానుకూల వాతావరణం ఉంది. అయినప్పటికీ, స్వయంసేవక్ సానుకూలత అంటే తాను ఆగిపోవాలని కాదు; ముందుకు సాగుతూనే ఉండాలి అని భావిస్తాడు. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, హిందువులను ఏకం చేయడమే మా లక్ష్యం. సంఘ్లో ఎలాంటి ప్రోత్సాహకాలూ లేవు. కానీ స్వయంసేవకులు తమ పనిని చేస్తారు. ఎందుకంటే వారు తాము చేసే పనిని ఆనందిస్తారు. తమ పని ప్రపంచ సంక్షేమానికి అంకితం చేయబడిందనే వాస్తవం నుండి వారు ప్రేరణ పొందుతారు.
దేశంలో అతివాదం (రాడికలిజం) పెరుగుతోంది. ప్రపంచానికి అతిపెద్ద ముప్పులలో ఒకటి వోకిజం. పర్యావరణ క్షీణత కూడా మానవ అసంతృప్తి నుండి ఉత్పన్నమైన ఒక ముఖ్యమైన ఆందోళన. దానికి పరిష్కారం ధర్మంలో ఉంది, అది మతం కాదు. ధర్మం పర్యావరణం పట్ల గౌరవంతో సహా వైవిధ్యాన్ని గౌరవిస్తుంది. ధర్మం సమతుల్యత గురించి మాట్లాడుతుంది… ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆధునిక సవాళ్ళకు భారత్ పరిష్కారం ఇవ్వగలదు. మన ధర్మం విశ్వ ధర్మం, అది ప్రపంచానికి శాంతిని తీసుకురాగలదు.
ధర్మం ఇతరులను మతం మార్చడానికి ప్రయత్నించదు… భారతీయ జీవనశైలి ప్రపంచం అనుకరించడానికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది.
ఇక్కడ భారతదేశం గురించి తెలుసుకోవాలి.
భారత్ ఎల్లప్పుడూ తన ప్రయోజనాల గురించి ఆలోచించకుండా సహాయం చేసింది… భారత్ తనను వ్యతిరేకించే వారికి కూడా సహాయం చేసింది. వ్యక్తిగత జీవితం నుండి పర్యావరణ సమస్యల వరకు, భారతీయ సమాజం ఒక ఉదాహరణగా నిలవాలి.
మనకు ముందుకు వెళ్ళే మార్గం ఏమిటి? సంఘ్లో మనం చేసే పని సమాజం మొత్తానికీ విస్తరించాలి. మన బాధ్యత వ్యక్తిత్వాన్ని నిర్మించడం, మరింత దేశభక్తి కలిగిన సమాజాన్ని పెంపొందించడం. మీడియాలో చాలా ప్రతికూల వార్తలు వస్తున్నాయి. నిజానికి అది అలా కాదు… మీడియాలో చూపించిన దానికి విరుద్ధంగా, భారత్లో 40 శాతానికి పైగా మంచి విషయాలు జరుగుతున్నాయి. కాబట్టి భారతదేశాన్ని మీడియా కవరేజ్ అనే రంగు కళ్ళద్దాలలోనుంచి చూడకూడదు.
దేశంలోని ప్రతీ గ్రామంలో, ప్రతీ ఇంట్లో…. పేదవారి నుండి ధనవంతుల వరకు ఎవరూ తాకకుండా ఉండాలి. త్వరలో ఒక యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. వారు సంఘ శాఖతో అనుసంధా నించబడాలి, సమాజం కోసం పనిచేసే వారు కూడా శాఖతో అనుసంధానం అయి ఉండాలి. జీవితంలో సానుకూలత చాలా అవసరం. మన దేశంలో చాలా వైవిధ్యం ఉంది. చొరబాట్ల కారణంగా అనేక మత వర్గాలూ, సిద్ధాంతాలూ బయటి నుండి వచ్చాయి; అవి మన దేశంలోనే ఉన్నాయి. సిద్ధాంతాలు బయటి నుండి కావచ్చు. అయితే, మన సమాజంలో ఉద్భవించిన విభజనలను పరిష్కరించుకోవాలి, దేశ ఐక్యతను బలోపేతం చేయడానికి మరిన్ని మార్గాలను అన్వేషించాలి.
మన మనస్సులలో సంఘర్షణ ఉంది. ఎవరినైనా చూసిన తర్వాత, వారి కులం మన మనసులోకి వస్తోందంటే అది పెద్ద సమస్యే. ఆ మనస్తత్వం మారాలి. మనం ఎక్కడ నివసిస్తున్నా లేదా ఎక్కడ పనిచేసినా, అందరితో స్నేహపూర్వకంగా ఉండాలి, వాళ్ళను మన వాళ్ళలా అంగీకరించాలి. నీరు, శ్మశానవాటికలు, దేవాలయాలూ అందరికీ ఉంటాయి. వాటిలో ఎటువంటి వివక్షా ఉండకూడదు.
‘మనిషి-మనిషి పరిచయం, హృదయపూర్వక సంభాషణ’ ఇది జరిగినప్పుడు, నిజమైన మార్పు జరుగుతుంది.
ఆత్మనిర్భరత లేదా స్వదేశీ ముఖ్యం. ఆత్మనిర్భర్ (స్వయం సమృద్ధి) అంటే దిగుమతులను పూర్తిగా ఆపివేయడం కాదు. ప్రపంచం పరస్పర ఆధారితం కాబట్టే చలనశీలంగా ఉంది. కాబట్టి ఎగుమతి- దిగుమతి కొనసాగుతుంది. అయితే, దానిలో ఎటువంటి ఒత్తిడి ఉండకూడదు. మన దగ్గర ఇప్పటికే ఉన్న లేదా సులభంగా తయారు చేయగల వస్తువులను దిగుమతి చేసుకోకపోవడమే స్వదేశీ అంటే. బైటి నుండి వస్తువులను దిగుమతి చేసుకోవడం స్థానిక విక్రేతలకు పెద్ద సమస్య.
సంఘ్ ప్రక్రియ ముఖ్యం.
సంఘ్ తాను చేసే పనికి ఘనతను తమదిగా తీసుకోదు. భారతీయ సమాజం ఈ దేశాన్ని ఉన్నత స్థాయికి, ప్రపంచంలో గణనీయమైన మార్పులను తీసుకువచ్చే స్థాయికి తీసుకెళ్లాలని సంఘ్ కోరుకుంటుంది.
హిందుత్వాన్ని రెండు పదాలలో వివరించవచ్చు: సత్యం, ప్రేమ. మానవ సంబంధాలు కేవలం ఒప్పందాల మీదా, వ్యాపారంపైనా మాత్రమే ఆధారపడి ఉండలేవు.