హిందూ అంటే అసహ్యమట. అది కూడా పర్షియన్ భాషలో. ఈ మాటన్నదెవరో కాదు కర్నాటక కాంగ్రెస్ చీప్ సతీష్ జార్కి హోళే. ఆయన వ్యాఖ్యలపై మండిపడింది బీజేపీ. హిందుసంస్థలు సైతం సతీష్ పై భగ్గుమన్నాయి. కర్నాటక బెళావిలో బీజేపీ ఆధ్వర్యంలో హిందూసంస్థల ఆధ్వర్యంలో ఆందోళనలకు దిగారు. రాహుల్ భారత్ జోడో యాత్ర సాగుతున్న వేళ హిందుత్వను కించపరుస్తూ ఇలాంటి మాటలేంటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
https://twitter.com/ANI/status/1589555973190225921?s=20&t=XgTaNYSc7MEVrTFWcBJUdg
హిందూ అనే పదం పర్షియన్ నుంచి వచ్చిందని.. దానికి అసహ్యించుకోవడం అనే అర్థం అని…అత్యంత మురికి అనే అర్థాలున్నాయని జార్కిహోలి అన్నారు. బీజేపీ నాయకురాలు ఖుష్బూ సైతం సోషల్‌మీడియా వేదిగ్గా కాంగ్రెస్ నేతలను నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శివరాజ్‌పాటిల్ ఇటీవలే భగవద్గీతలో కూడా జిహాద్ ఉందన్నారని మండిపడ్డారామె. ఈ స్థాయిలో నిరసనలు వస్తున్నా వెనక్కి తగ్గలేదు సతీష్. తన మాటల్లో తప్పుంటే నిరూపించాలని సవాల్ చేశారు. నిరూపిస్తే రాజీనామా చేయడానికి సిద్ధమన్నారు. పార్టీ అధిష్టానం స్పందించేవరకు, సతీష్ పై చర్యలు తీసుకునేవరకూ నిరసనలు కొనసాగుతాయని హిందుసంఘాలు హెచ్చరిస్తున్నాయి.