ఈ క్రింది ఫొటోలో ఉన్న మందు పేరు “కర్కలైట్”
దీనిని కోవిడ్ వచ్చి తగ్గిన వారికి ఇమ్యూనిటీ బూస్టర్ గా కొందరు అల్లోపతి డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తున్నారు.
10 మాత్రల ధర కేవలం ₹390.
ఈ మాత్రలో ఉన్నవి రెండే రెండు రకాల పదార్ధాలు.
అవి ..
Curcuma Longa+Piper Nigrum
ఏవేవో మనకు తెలియని లాటిన్ పదాలు అని భయపడకండి…
అచ్చ తెలుగులో చెప్పాలి అంటే…
పసుపు, నల్ల మిరియాలు.
ఈ రెండు పదార్థాలు కల ఈ మందు ఇమ్యూనిటీ పెంచుతుంది అని సాక్షాత్తు USFDA తెలిపి ఈ మందు ఉపయోగించడానికి అనుమతి ఇచ్చింది.
ఈ రెండు పదార్ధాలు భారతీయుల భోజనంలో విడదీయలేని పదార్థాలు. వీటి ఔషధ గుణాలను వాటి ఉపయోగాలను తెలుసుకున్న మన పూర్వీకులు వీటిని రోజూ అందరూ స్వీకరించే విధంగా ఆహారంలో భాగం చేశారు. అలా మన శరీర రోగ నిరోధక రక్షణ వ్యవస్థ పటిష్టంగా వుండే విధంగా ఏర్పాటు చేశారు.
ఏ ఆధరవు తయారు చేసుకుని తినే ఆర్ధిక స్తోమత లేనివారు కూడా చారు తింటారు. దానిలో పసుపు, చారు గుండ లేదా రసం పౌడర్ లేదా కాస్త మిరియాలు వేసుకొని తింటారు.
మన పూర్వీకులు తయారు చేసిన పోపుల డబ్బా మనకు శ్రీరామ రక్ష.
ఇదే మందు ఏ పంచ కట్టుకున్న పల్లెటూరు ఆనందయ్య చెప్పినా లేక గడ్డం పెంచుకొని కాషాయ దుస్తులు ధరించి రామ్ దేవ్ బాబా చెప్పినా మన ఉన్మాద మేధావులు, ఉదారవాదులు ఆ మందుని ఎగతాళి చేసి చెప్పిన వాడి తాత ముత్తాతల దగ్గర నుండి తిట్టేవారు. గో మూత్రం గాళ్ళు అని వెక్కిరించేవారు.
ఇప్పుడు ఈ మందు ఫలానాలా పనిచేస్తుంది, ఉపయోగం ఉంది అని బోల్డు డిగ్రీలు చదివి పొడూగు తెల్లకోటు వేసుకున్న తెల్ల శాస్త్రవేత్త చెప్పాడు కాబట్టి ఈ మేధావులకు ఏ సంకోచం ఉండదు.
పూర్తి బానిస మనస్తత్వం అలవాటు చేసుకున్నాం.
…శాస్త్రి…