తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం సెక్యులరిజం పేరుతో రాజకీయ చేస్తోంది. ఓటు బ్యాంకు రాజకీయాలతో మైనారిటీలను రెచ్చగొడుతోంది. దీంతో అక్కడి వక్ఫ్ బోర్డు లు.. డీఎంకే అండతో చెలరేగిపోతున్నాయి. తమిళనాడులోని అనేక చోట్ల భూముల్ని ఆక్రమించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కొన్నిచోట్ల ఏకంగా ఊళ్లకు ఊళ్లే తమవి అంటూ బోర్డులు పెడుతున్నాయి.
తమిళనాడు లోని విల్లూరు కి దగ్గర లోని చిన్న గ్రామం
కట్టుకొల్లయ్. ఈ గ్రామంలోని భూమంతా తమదే అంటూ వక్ఫ్ బోర్డు రాత్రికి రాత్రే బోర్డు పెట్టేసింది. ఇప్పటిదాకా ఉన్న చట్టాల ప్రకారం దేశంలోని ఏ భూమి అయినా తమదే అని లాగేసుకుని అధికారం వర్క్స్ బోర్డుకి ఉన్నది,, ఈ విషయంలో కలెక్టర్లు పోలీసులు కూడా ఏమీ చేయలేరు. తమిళనాడులోని ఈ గ్రామం పరిస్థితి కూడా అలాగే తయారయ్యింది. ఊరంతా ఖాళీ చేసి వెళ్లిపోవాలని,, లేదంటే ఊరిలో ఉంటున్నందుకు గాను తమకు అద్దె చెల్లించాలని స్థానిక మసీదు పెద్దలు ప్రకటన చేసేసారు. దీంతో గ్రామస్తులంతా లబోదిబోమంటున్నారు. రెవెన్యూ పోలీసు అధికారులను వేడుకుంటున్నా .. ఏమీ ప్రయోజనం కనిపించడం లేదు.
ఇప్పటికే తమిళనాడులోని కొన్ని గ్రామాల్లో వక్ఫ్ బోర్డు.. మొత్తం భూములు లాగేసుకుంది. కొన్నిచోట్ల దేవాలయ భూములను కూడా .. తమదే అంటూ బోర్డు పెట్టేసింది అయినప్పటికీ అక్కడి డీఎంకే ప్రభుత్వం నోరు మెతపటం లేదు. సరి కదా, వక్ఫ్ బోర్డు సవరణలకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఓటు వేసింది. ఇప్పుడు వక్ఫ్ బోర్డు సవరణలకు వ్యతిరేకంగా ఆందోళనలు కూడా చేస్తోంది.
ఏకంగా ప్రభుత్వమే సపోర్ట్ చేస్తుండడంతో వక్ఫ్ బోర్డు దూకుడుగా ముందుకు వెళుతుంది. దీంతో ప్రజల మొర వినిపించుకునే నాధుడే కరువయ్యారు. ఇప్పటి తమిళనాడులోని పరిస్థితి .. రేపు మన తెలంగాణలో రాదు అన్న గ్యారెంటీ లేదు. మేలుకోవాల్సింది ఇక ప్రజలే..!