వెస్టె బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ టీఎంసీకి చెందిన కొందరు వ్యక్తులు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు మూడు దశల పోలింగ్ ప్రక్రియ ముగిసిపోయింది. ఇక నాలుగో దశ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే పలుచోట్ల బీజేపీ అగ్రనేతలపై దాడులు జరుగుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ వాహనంపై దాడి జరిగింది. కుచ్బిహార్ ప్రాంతంలోని సీతల్కుచి సమీపంలో దిలీప్ ఘోష్ వాహనంపై దుండగులు దాడి చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తెలిపారు.
కాగా, మంగళవారం రాత్రి బీజేపీ మైనార్టీ అగ్రనేత షాన్వాజ్ హుస్సేన్ ర్యాలీ చేపడుతుండగా రాళ్ల దాడికి పాల్పడ్డారు. టీఎంసీ గుండాలే ఈ ఘాతుకానికి ఒడిగట్టారని షాన్వాజ్ హుస్సేన్ ఆరోపించారు.
https://twitter.com/ANI/status/1379789415053094915