
Supreme Court of India
బీబీసీ ప్రసారాలను భారత్ లో నిషేధించాలని దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. తప్పుడు అవగాహనతో పిటిషన్ వేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మోదీపై వివాదాస్పద డాక్యుమెంటరీని బీబీసీ ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. హిందు సేన చీఫ్ విష్ణు గుప్త ఈ పిటిషన వేశారు. బీబీసీ భారత్ వ్యతిరేక వైఖరితో ఉందని… అంతర్జాతీయంగా ఎదుగుతున్న దేశానికి, ప్రధానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తోందని అందుకే ఈ డాక్యుమెంటరీని ప్రసారం చేశారని ఆయన తరఫు న్యాయవాదులు పింకీ ఆనందం కోర్టుకు తెలిపారు. దీనిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్ ధర్మాసనం స్పందిస్తూ, ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. మీరు పూర్తి సెన్సార్షిప్ విధించాలని కోరుకుంటున్నారా? అదెలా అని ప్రశ్నించింది.
https://twitter.com/ANI/status/1623948191220785152?s=20&t=xR9KORQ0CXvBfhIMhPxDQw