ఆధునిక కాలంలో కనిపిస్తున్న టెక్నాలజీ సైన్స్ సాంకేతిక రంగాల మూలాలు వేదాలలో స్పష్టంగా కనిపిస్తాయని ఆర్ఎస్ఎస్ సర్ సంఘఛాలక్ డాక్టర్ మోహన్ జీ భాగవత్ అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించిన ఉదాహరణలను కూడా ఆయన వివరించారు. వేదమే భారతీయ సంప్రదాయానికి ఒరవడికి మూలమని ఆయన వివరించారు. దామోదర్ సత్వలేకర్ రచించిన వేదాల హిందీ వ్యాఖ్యానం మూడో ఎడిషన్ను ఆవిష్కరిస్తూ వేదాలు, భారతదేశం ఒకటేనని అని స్పష్టం చేశారు.
వేదాల గొప్పతనాన్ని మోహన్ జీ భాగవత్ వివరించారు.
వేదాలు సనాతన ధర్మానికి ఆధారం అని చెబుతూ వేదాలలో విజ్ఞానం, సైన్స్, గణితం, మతం, వైద్యం, సంగీతం సమృద్ధిగా ఉన్నాయని ఆయన తెలిపారు. వేదాల్లోని మంత్రాల్లో కూడా అంకగణితం, క్యూబ్, క్యూబ్ రూట్ సూత్రాలు స్పష్టంగా పేర్కొన్నారని ఆయన చెప్పారు. వేదాలలో సమస్త లోక సంక్షేమం గురించిన చర్చలు ఉన్నాయని చెబుతూ వేదాలు ప్రపంచంలోని సమస్త మానవాళి ఐక్యతకు మార్గాన్ని చూపుతాయని డా. భగవత్ స్పష్టం చేశారు.
జీవన విధానాన్ని కూడా వేదాలు నేర్పిస్తాయి అని ఆయన గుర్తు చేశారు.
సనాతన సంస్కృతిలో జీవితాన్ని గడపడానికి పోటీ పడాల్సిన అవసరం లేదని, వేదాలు మనకు దీనిని నేర్పించాయని చెబుతూ. ‘సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ’ అని డాక్టర్ భగవత్ పేర్కొన్నారు. మన ఋషులు లోకకల్యాణం కోసం వేదాలను రచించారని చెప్పారు.
మనదేశంలో కొడుకు కడుపు నిండగానే అమ్మ తృప్తి చెందుతుందని పేర్కొంటూ సైన్స్ దీన్ని నమ్మకపోవచ్చు కానీ ఇది భౌతిక వాదానికి మించిన ఆనందం అని ఆయన వివరించారు. అన్ని విజ్ఞాన వ్యవస్థలలో వేదాల ఆధారాన్ని చూడవచ్చని చెబుతూ మొత్తం మానవాళి వేదాల అధ్యయనం ద్వారా జ్ఞానోదయం పొందుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ధర్మజాగరణ నాయకులు పాల్గొన్నారు