ఈ కాలంలో యువతరమే మార్పు తేవగల శక్తి! గ్రామీణాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాల్సిన బాధ్యత ఇప్పుడు యువతపై ఉంది. స్థానిక ఎన్నికలే గ్రామ అభివృద్ధికి ధ్యేయంగా మారతాయి. కానీ, ఈ ఎన్నికల్లో యువత చాలామంది వెనుకబడుతున్నారు, లేదా అజ్ఞాతంగా ఓటు హక్కును వినియోగించకుండా ఉంటున్నారు.
గ్రామంలోని కనీస సదుపాయాలు — రోడ్లు, నీటి వనరులు, విద్యుత్, పాఠశాలలు, వైద్య సేవలు… ఇవన్నీ స్థానిక పాలనపైనే ఆధారపడి ఉంటాయి. అలాంటప్పుడు యువత ముందుకు వచ్చి నాయకత్వ బాధ్యతలు చేపట్టాలి. ఒక మంచి నాయకుడు గ్రామానికి మార్గదర్శకుడు అవుతాడు. అందుకే ఈ సారి స్థానిక ఎన్నికల్లో యువత ప్రగతివంతమైన ఆలోచనలతో రంగంలోకి దిగాలి.
ఆధునిక భావజాలం ఉన్న యువత ముందుకు వచ్చి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి.
యువతలో ఉన్న ఉత్సాహం, విజన్, టెక్నాలజీ వినియోగం — ఇవన్నీ గ్రామ అభివృద్ధికి పనికొచ్చే అంశాలు
నిజమైన సేవ భావనతో ముందుకు వచ్చిన వారు గ్రామాన్ని సక్రమ దిశలో నడిపించగలరు.
గ్రామ సమస్యలను ఎత్తిచూపడమే కాదు, వాటికి పరిష్కారం చూపే దిశగా పనిచేయగల శక్తి యువతలోనే ఉంది.
రాజకీయ నిబద్ధత కంటే అభివృద్ధి పట్ల నిబద్ధత ముఖ్యం.
బదిలీకి ఓటు కాదు… అభివృద్ధికి ఓటు అవసరం!
ఇప్పటి వరకు జరిగిన స్థానిక పాలనలతో ప్రజలు అసంతృప్తి చెందుతున్నారు. నాయకులు ఒక్కసారి గెలిస్తే ప్రజల దగ్గరకు తిరిగి వెళ్లరని అనుభవం మారాలి. ఈసారి అభివృద్ధిని పట్టాలెక్కించే యువ నాయకులు అవసరం. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు, సేవా దృక్పథం ఉన్న నాయకుడు కావాలి.
ఊరికి మార్పు కావాలంటే… యువతే మార్గం
ఊరి అభివృద్ధికి మార్గం ఓటుతో మొదలవుతుంది. యువత తమ సామర్థ్యాన్ని రాజకీయంగా చూపించాల్సిన సమయం ఇది. మార్పు కోసం ఎదురు చూడకూడదు… మనమే మార్పు కావాలి. ప్రజల విశ్వాసాన్ని గెలవాలంటే, సేవ భావనతో పని చేయాలి.
ఊరి లో మార్పు కావాలంటే మనం మారాలి. యువత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు స్థానిక ఎన్నికల్లో చురుకుగా పాల్గొని మంచి నాయకులను ఎన్నుకోవాలి. కానీ నిజమైన మార్పు యువత చేతిలో ఉంది.
ఊరికి మార్పు కావాలంటే… యువతే మార్గం
చివరిగా – ఈసారి యువతే ముందుండాలి!
ఊరి లో మార్పు కావాలంటే మనం మారాలి. యువత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు స్థానిక ఎన్నికల్లో చురుకుగా పాల్గొని మంచి నాయకులను ఎన్నుకోవాలి. కానీ నిజమైన మార్పు యువత చేతిలో ఉంది.
“ఊరి గెలుపు నీ చేతుల్లో ఉంది…
ఒక్క ఓటుతో ఊరు మారిపోవచ్చు!” – పడిగెల నాగరాజ్