దేశవ్యాప్తంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మీద బురదజల్లే కుహానా శక్తులకు లోటు ఏమీ లేదు. స్వాతంత్ర్య పోరాటంలో సంఘ్ ఏ మాత్రం పాల్గో లేద ని స్వాతంత్ర్య ఉద్యమాన్ని వ్యతిరేకించిందని, బ్రిటిష్ వాళ్లకు మద్దతుగా నిలిచిందని రకరకాల ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. ఇది పూర్తిగా అవాస్తవం నిజానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం ఏర్పడినాటికి అంగ వ్యవస్థాపకులు డాక్టర్ హెగ్డేవార్ అనేక సందర్భాలలో స్వాతంత్ర్య పోరాటంలో స్వయంగా పాల్గొన్నారు, మరియు జైలు శిక్ష కూడా అనుభవించారు.
ఇందుకు సంబంధించిన ఆధారాలు చూద్దాం.
స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనడం తప్పనిసరి అని, ప్రతిదినం ఒక గంట శాఖలో ఉండి, మిగతా సమయాన్ని దేశ స్వాతంత్ర్యం కోసం ఇవ్వవచ్చని డాక్టర్ జీ స్వయంసేవకులకు చెప్పడం జరిగింది. స్వాతంత్ర పోరాటం కోసం ముందస్తుగా కాంగ్రెస్ ఉద్యమ నిర్మాణం చేసింది కాబట్టి, మరొక రాజకీయ కేంద్రం ఉండకూడదని, అందువల్ల ఆర్ఎస్ఎస్ బ్యానర్ పై కాకుండా.. కాంగ్రెస్ చేస్తున్న స్వాతంత్రోద్యమ కార్యక్రమాలలోనే అందరూ పాల్గొనాలని పూజ్య డాక్టర్ జీ సూచించారు. ఎందుకంటే “ఒకటే వేదిక.. ఒకటే జెండా.. ఒకటే బ్యానర్.. ఒకే కార్యక్రమం” ఉండాలనే భావాన్ని వ్యక్తపరచి.. వారు కూడా స్వయంగా పాల్గొనడం జరిగింది.
ఇందుకు సంబంధించిన స్పష్టమైన సూచన చేస్తూ వచ్చారు.
స్వాతంత్ర సాధనకు తమ సర్వస్వాన్ని త్యాగం చేసేందుకు సిద్ధం కావాలని 1929 ఏప్రిల్ 27,28 తేదీలలో వార్ధాలో జరిగిన శిబిరానికి వచ్చిన స్వయంసేవకులకు డాక్టర్ జీ ఉద్బోధించారు. 1929 మార్చిలో సైమన్ కమిషన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో RSS పాలుపంచుకుంది. స్వాతంత్ర్యోద్యమ సమయంలో… రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రతిజ్ఞ చివరిలో… దేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం మనం పనిచేయాలని అని ప్రతిజ్ఞ చేయడం జరిగేది. అనేకమంది సంఘ స్వయంసేవకులు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. ఈ విషయం కొద్దిమందికే తెలుసు… ఎందుకంటే, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఎలాంటి ప్రచార ఆర్భాటాన్నీ కోరుకోదు. స్వయంసేవకులు సహజంగానే స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. బ్రిటిష్ వారి లాఠీ దెబ్బలకు, తూటాలకు ఎదురొడ్డారు.
మరో విషయం కూడా గమనించాలి. డాక్టర్ హెడ్గేవార్ జీ పాఠశాలలో విద్యార్థిగా ఉన్నప్పుడు నీల్సిటీ హైస్కూల్లో విక్టోరియా రాణి 60 వసంతాల పట్టాభిషేక మహోత్సవాలు జరిగాయి. ఆ సందర్భంగా పంచిన స్వీట్ తినకుండా విసిరివేసి బ్రిటిష్ వారి సామ్రాజ్యవాద అహంకార ధోరణిని వ్యతిరేకించారు. పాఠశాలలోనే వందేమాతర నినాదాన్ని అందరితో చెప్పించి, చిన్న వయస్సులోనే స్వాతంత్ర్య పోరాటానికి ఊపిరులూదారు. కలకత్తాలో డాక్టర్ కోర్స్ చదువుతున్నప్పుడు “అనుశీలనా సమితి” అనే విప్లవ సంస్థతో కలిసి హెడ్గేవార్ పని చేస్తుండేవారు. ఆ రహస్య సంస్థలో తను కొకైన్ అనే సంకేత నామముతో పని చేశారు. పాండురావ్ కాంఖజి అనే స్వదేశ్ ఉద్యమకారుడు, డాక్టర్ జీ, ఆయన మిత్రులందరూ స్వదేశీ ఆవశ్యకతను చాటి చెప్పే ఉపన్యాసాలు బాగున్నాయని కేసరి పత్రికలో రాయడం జరిగింది. డాక్టర్ జీ వైద్య విద్య పూర్తి అయి కలకత్తా నుండి నాగపూర్ వచ్చిన తరువాత కూడా విప్లవకారులతో సంబంధాలను కొనసాగించారు. ఆ పరిచయాలతోనే దేశంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు తీసుకరావడం కోసం ప్రయత్నం చేశారు.
ఇలా అనేక సందర్భాలలో సంఘ్ స్వయం సేవకులు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. దేశం కోసం సర్వస్వం సమర్పణ చేసిన గొప్ప దేశభక్తులు డాక్టర్ జీ ఇచ్చిన స్ఫూర్తితో ఇదంతా జరిగింది.