NGO ల ముసుగులో మత మర్పిడులను ప్రోత్సహిస్తున్న వ్యక్తులపై మరియు సంస్థలపై ఏ రకమైన సంచలన కార్యక్రమాలు లేదా రెచ్చగొట్టే ప్రకటనలు మొదలగు వాటికి పాల్పడకుండా ఇప్పటికే ఉన్న ప్రభుత్వ రూల్స్ ని ఉటంకిస్తూ ఈ సంస్థలు పాల్పడుతున్న మోసాలను నేరుగా సంబంధిత అధికారుల మరియు మంత్రిత్వ శాఖల దృష్టికి తీసుకువెళ్లి ఆ సంస్థలపై తగు చర్యలు తీసుకునేటట్లు చేయడంలో…
లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్(LRPF) గొప్ప విజయాలు నమోదు చేసుకుంటోంది.
ఫారెన్ కాంట్రిబ్యూషన్ రేగులేటరీ యాక్ట్ (FCRA) నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు అని నిన్న సుమారు 6000 NGO ల లైసెన్సులను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.
మన లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ మిగతా సంస్థలతో పాటు రెండు ముఖ్యమైన సంస్థలపై కేంద్ర మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. అందులో ఒకటి ఇండియన్ మెడికల్ అసోసియేషన్. రెండవది OXFAM అనే పెద్ద క్రిస్టియన్ NGO.
నిన్న FCRA లైసెన్సులు రద్దు అయిన సంస్థల లిస్ట్ లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పేరు కూడా ఉంది.
మే నెల 25వ తేదీ 2021న, లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ IMA, FCRA లైసెన్స్‌ను రద్దు చేయాలని కోరుతూ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ఈ IMA Mr. జాన్ రోజ్ ఆస్టిన్ జయలాల్ అధ్యక్షతన నడుస్తున్న NGO. ఈ సంస్థ సమాజంలో బలహీన వ్యక్తులను టార్గెట్ చేస్తూ క్రైస్తవ మతంలోకి మార్చడాన్ని చురుకుగా ప్రోత్సహిస్తోంది.
మిస్టర్ జయలాల్ ప్రకటిస్తున్న మత ప్రచారానికి సంబంధించిన వ్యూహాలు మరియు కార్యకలాపాలు మత సామరస్యానికి భంగం కలిగించే అవకాశం ఉంది కాబట్టి అవి విదేశీ విరాళాల నియంత్రణ చట్టంలోని సెక్షన్ 12(4)(f)(vi)ని ఉల్లంఘించాయి కాబట్టి తగు చర్యలు తీసుకోవాలి అని LRPF కోరింది. IMA 2006 సం. నుండి ఇప్పటివరకు FCRA ద్వారా రూ.8,91,22,061 విరాళాలు గా పొందింది.
అంతే కాక దీని అధ్యక్షుడు జయపాల్ IMA ముసుగులో క్రిస్టియన్ మత ప్రచారానికి పాల్పడుతున్నారు అని ఆరోపణలపై ఢిల్లీ కోర్టు అతనికి హెచ్చరిక జారీ చేసింది కూడా.
రెండో సంస్థ OXFAM –
గత సంవత్సరం దేశంలో కోవిద్ కేసులు చాలా ఎక్కువగా వున్న సమయంలో ఈ NGO ప్రజలను రెచ్చగొట్టి భయభ్రాంతులకు గురిచేసే విధంగా ప్రకటనలు ఇస్తూ నిధుల సేకరణకు పాలు పడుతోంది అని LRPF కేంద్ర మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది.
లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఇటువంటి చాలా విషయాల్లో సామాన్య ప్రజల్లో చైతన్యం తీసుకువస్తూ రోజూ విజయాలు నమోదుచేసుకుంటోంది.
Courtesy :- Chada Shastry