గుజరాత్లో అఖండ విజయం సాధించిన బీజేపీ హిమాచల్ ప్రదేశ్ ను మాత్రం నిలుపుకోలేకపోయింది. ప్రభుత్వాలను మార్చే సెంటిమెంట్ అక్కడ ఉంది.ఆ సంప్రదాయాన్నే కొనసాగిస్తూ అధికార పార్టీని కాదని…ఈసారి కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారు ఓటర్లు. కాంగ్రెస్ పకడ్బందీ వ్యూహాలతో పాటు రెబెల్స్ బెడత పార్టీ పరాజయానికి కారణంగా చెప్పవచ్చు. సిట్టింగుల్లో చాలామందికి టికెట్ ఇవ్వలేదు. కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చారు. అయితే టికెట్ దక్కని చాలామంది తాజామాజీలు ఇండిపెండెంట్ గా బరిలో దిగారు. సంప్రదాయ ఓట్లు కూడా చీలడం కమలం పార్టీ అభ్యర్థులను ఓటమికి కారణం. దాదాపు 20 చోట్ల రెబెల్స్ పార్టీ ఓటమికి కారణయ్యారు.