సింగం సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అన్ని భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా. ఒకసారి టార్గెట్ ఫిక్స్ చేసుకొంటే,, బ్లైండ్ గా దూసుకెళ్లిపోయే పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ కథనం ఇది. అచ్చు గుద్దినట్లు సింగం మాదిరి పోలీసు ఆఫీసర్ ను చూడాలంటే.. ఉత్తర ప్రదేశ్ లోని సంబాలా పట్టణం వెళ్లాల్సిందే. అక్కడ పోలీసు కమిషనర్ గా సేవలు అందిస్తున్న అనూజ్ చౌదరి నిజంగానే పోలీసు సింగం.
….
ఇప్పుడు సంబాలా సంఘటనల్లో అనూజ్ చౌదరి పేరు మార్మోగిపోతోంది. అక్కడ మసీదు దగ్గర సర్వే చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ సమయంలో కోర్టు కమిషనర్ ను అక్కడకు రానీయకుండా అల్లరి మూకలు రాళ్లు రువ్వేసి నానా బీభత్సం చేసేశారు. ఆ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించి అధికారుల్ని సురక్షితంగా వెనక్కి తెచ్చేశారు. దీంతో అధికారులు పారిపోయారంటూ మసీదుకు సంబంధించిన అల్లరి మూకలు సంబరాలు చేసుకొన్నాయి. సింహం ఒక అడుగు వెనక్కి వేస్తే, నాలుగు అడుగులు ముందుకు దూకుతుంది అన్న సంగతి వాళ్లు ఆలోచించలేదు.
.. ..
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కు పోలీసు సింగం అనూజ్ చౌదరి అంటే నమ్మకం. అందుకే తన వ్యూహం ఏమిటో నిశ్శబ్దంగా అనూజ్ కు చేరవేశారు. ఆపరేషన్ విద్యుత్ టాస్క్ ఫోర్స్ ను సింగం అక్షరాలా అమలు చేసేశారు. విద్యుత్ చౌర్యం తనిఖీల పేరుతో మొత్తం పోలీసు బలగాల్ని శనివారం తెల్లవారు జామున మసీదు చుట్టూ దింపేశారు. దట్టమైన మంచు అలుముకొన్న వేళ పోలీసులు, విద్యుత్ అధికారులు టాస్క్ ఫోర్స్ లా ఏర్పడి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ జల్లెడ పట్టేశారు. ఇంకేముంది, అసలు బండారం మొత్తం బయట పడిపోయింది. చలికాలం లో తెల్లవారు జాము సమయం కావటంతో అల్లరిమూకలు తేరుకొనేసరికి మొత్తం ఏరియా పోలీసుల కంట్రోల్ లోకి వచ్చేసింది. అనూజ్ చౌదరి వేసుకొన్న స్కెచ్ పర్ ఫెక్ట్ గా వర్కవుట్ అయింది.
….
సంబాలాలోని బాబ్రీ మసీదు దగ్గర అనూజ్ చౌదరి టీమ్ టార్గెట్ చేసుకొన్నారు. అక్కడ భూమిలో దాగి ఉన్న శివాలయాన్ని నిశ్శబ్దంగా బయటకు వెలికి తీశారు. అక్కడ ఉన్న శివలింగం, నందీశ్వరుడి విగ్రహాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చారు. ఒక్క ప్రాణ నష్టం లేకుండా ఇంతటి కఠినమైన ఆపరేషన్ ను పూర్తి చేయటం మామూలు విషయం కాదు. దీంతో ఒక్కసారిగా అనూజ్ చౌదరి పేరు మార్మోగిపోయింది.
…
నిజానికి అనూజ్ చౌదరి వ్యక్తిగతంగా హనుమంతుడికి గొప్ప భక్తుడు. మసీదు దగ్గర హనుమంతుడి గుడిని ఏళ్ల తరబడి భూ స్థాపితం చేసి ఉంచారు అని తెలుసుకొన్నాక,, ఆయన కు కర్తవ్యం బోధ పడింది. పోలీసు ఫోర్స్ సహాయంతో తెల్లవారు జామున దట్టమైన చలిలో విపరీతంగా గాలింపు చేపట్టారు. చివరకు హనుమంతుడి గుడి కనిపించగానే ఆయనలోని భక్తి పొంగిపోయింది. స్వయంగా హనుమాన్ విగ్రహానికి పూజలు చేసి తన నిబద్దతను చాటుకొన్నారు.
..
పోలీసు శాఖ లో అనూజ్ చౌదరికి చాలా ఫాలోయింగ్ ఉంది. క్రీడల్లో కూడా అనూజ్ చౌదరి చాలా పవర్ ఫుల్ . స్వయంగా కుస్తీ పోటీల్లో అద్భుతంగా పాల్గొని ఎన్నెన్నో అవార్డులు గెలుచుకొన్నారు. ఒలింపిక్స్ దాకా వెళ్లి అక్కడ కుస్తీ పోటీల్లో భారత్ తరుపున పాల్గొన్నారు. ఆసియా కామన్ వెల్త్ క్రీడల్లో కుస్తీ పోటీల్లో బంగారు పతకాన్ని అందుకొన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అందించే అర్జున్ అవార్డుకి ఎంపిక అయ్యారు.
…
పోలీసు సింగం అనూజ్ చౌదరికి మరో అలవాటు కూడా ఉంది. స్టూడెంట్స్ ను ఆయన బాగా ట్రైన్ చేస్తారు. తనకు తాను ప్రౌడ్ ఇండియన్ అని చెప్పుకొంటారు. జాతీయ భావాల్ని యువతలో ఎప్పటికప్పుడు నూరిపోస్తుంటారు. ఇటువంటి సింగం పోలీసులకు మనం కూడా శెల్యూట్ చేద్దామా..