సినిమా హీరో అల్లు అర్జున్ అరెస్టు బెయిల్ అనే అంశాలు రెండు రోజులు పాటు రెండు తెలుగు రాష్ట్రాన్ని ఊపేసాయి. ఈ ఘటనను అందరూ ఖండిస్తున్నప్పటికీ,, అల్లు అర్జున్ ను ఏకంగా అరెస్టు చేయడం,, శుక్రవారం సాయంత్రం జైలుకు పంపించడం అనేది వివాదాస్పదం అవుతున్నది. ఇందులో రాజకీయ కోణం ఉందన్నమాట స్పష్టంగా వినిపిస్తోంది. అరెస్టు చేయించింది తెలంగాణ ప్రభుత్వం కాబట్టి అందరి దృష్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద పడుతుంది. కొంతకాలంగా రేవంత్ రెడ్డి సర్కారు ..సినిమా ప్రముఖుల్ని ముప్పు తిప్పలు పెడుతోంది అనడంల్లో సందేహం లేదు. కానీ చాలా సందర్భాల్లో ఈ ఎత్తుగడలు బెడిసి కొడుతున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక చాలామంది ప్రముఖులతో పాటు సినిమా ప్రముఖులు కూడా పెద్దగా లెక్క చేయలేదు అనేది సస్పష్టం. అందుకే మంత్రి వర్గం ప్రమాణస్వీకారం తర్వాత.. సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తమకు శుభాకాంక్షలు చెప్పేందుకు సినిమా ప్రముఖులు ఎవరూ రాలేదని బహిరంగంగా అన్నారు. అయినప్పటికీ సినీ పరిశ్రమ పెద్దగా పట్టించుకోలేదు. భారీ సినిమాలకు సంబంధించిన పెద్ద పెద్ద ఫంక్షన్ లలో కూడా ప్రభుత్వ పెద్దల్ని ఆహ్వానించిన సందర్భాలు చాలా చాలా తక్కువ.
ఆ మధ్యకాలంలో హైడ్రా కూల్చివేతల మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ టార్గెట్‌గా నాగార్జున నిలిచారు
ఆ తర్వాత నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్ కూల్చివేయించారు. అప్పట్లో కొంతమంది సినీ ప్రముఖులు సీఎం రేవంత్ ని కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు.
నాగార్జున కుటుంబంపై మరోమంత్రి కొండా సురేఖ అసభ్యంగా మాట్లాడటం వంటి పరిణామాలు జరిగాయి. కొండా సురేఖపై సినీప్రముఖులంతా ముక్తకంఠంతో నిప్పులుచెరిగారు. నాగార్జున కుటుంబం ఏం చేసిందని దానికంటే .. కొండా సురేఖ నోరు పారేసుకోవడం వివాదాస్పదం అయింది.
మొన్నటి కి మొన్న మోహన్ బాబు ఎపిసోడ్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడుగా వెళ్ళింది అన్నమాట వినిపిస్తోంది. కేసుని కామప్ చేసుకోవడం కోసం సినిమా పెద్దలు ప్రయత్నం చేసినప్పటికీ రేవంత్ సర్కారు అవకాశం ఇవ్వలేదు అని తెలుస్తోంది. ఇంటిలోని కుటుంబ సభ్యుల మధ్య వివాదాన్ని పెద్దది చేయడంలో మీడియాతో పాటు పోలీసు శాఖ కూడా దూకుడుగా వ్యవహరించింది అని తెలుస్తోంది. కొంతమంది పోలీసులు ఒక వైపే నిలిచి పనిచేయడం అందరికి స్పష్టంగా అర్థం అయిపోయింది.
ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో కూడా ప్రభుత్వం చేసిన పని రివర్స లో కొట్టింది. సెలబ్రిటీలు ర్యాలీ చేసినప్పుడు,, తొక్కిసలాటలో చనిపోవడం చాలా దురదృష్టకరం. ఇటువంటప్పుడు కేసు పెట్టడం విచారణకు పిలిపించడం అందరూ ఆమోదిస్తారు. కానీ ఏకంగా అరెస్టు చేయించడం,, అది కూడా రెండవ శనివారం ఆదివారం అనే సెలవులు ఉన్న సమయంలో.,, ముందు రోజు శుక్రవారం అరెస్టు చేసి జైలుకు పంపించడం.. వివాదాస్పదం అవుతున్నాయి. హైకోర్టు జోక్యంతో అల్లు అర్జున్‌కి బెయిల్ దక్కింది
అల్లు అర్జున్ మాత్రం డీసెంట్‌గా వ్యవహరిస్తున్నారు. అరెస్టు సమయంలో పోలీసుల ప్రవర్తన కూడా సున్నితంగా బయటపెట్టారు. అనంతరం కోర్టు ప్రొసీడింగ్స్ కి పూర్తిగా సహకరించారు. బెయిల్ వచ్చాక కూడా ఏ మాత్రం హడావుడి చేయలేదు. జైలు బయట కూడా హుందాగా మాట్లాడి గౌరవం పెంచుకున్నారు.
మొత్తం మీద అల్లు అర్జున్ ఎపిసోడ్ కూడా రివర్స్ అయ్యింది అన్నమాట వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సినీ పరిశ్రమ మీద ఈ రకంగా పట్టు చిక్కిందా లేదా అన్నది కొద్ది రోజుల్లో అర్థమైపోతుంది.