పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ లేఖరాశారు. పాక్‌తో తాము సత్సంబంధలానే కోరుకుంటున్నామని ఈ లేఖలో స్పష్టం చేశారు. అయితే ఇందుకు ఇరు దేశాల మధ్య సామరస్యక వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని లేఖలో మోదీ పేర్కొన్నారు. అంతేకాదు.. ఉగ్రవాదానికి తావు లేకుండా మంచి వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత పాక్‌పైనే ఉందన్నారు. దీంతో పాక్ ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పుకొచ్చారు. అయితే ప్రతి ఏడాది పాకిస్థాన్ నేషనల్ డే సందర్భంగా పాక్ ప్రధానికి శుభాకాంక్షలు చెబుతూ భారత ప్రధాని లేఖ రాయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సారి రాసిన లేఖ కూడా అలాంటిదేనని.. ఇందులో ప్రత్యేకత ఏమీ లేదంటూ అధికారులు తెలిపారు.