ఆనందయ్య గారి మందు పనితీరు నిరూపించబడలేదు కాబట్టి ఆ నాటు మందు వాడకండి – జన అజ్ఞాన వేదిక కర పత్రం ఈ అజ్ఞాన వేదిక వాళ్ళు ఎప్పుడో వచ్చే ఇటువంటి కరోనా సమయంలో ప్రజలని చైతన్య పరుస్తూ గొప్ప సమాజ సేవ చేస్తున్నారు.. చాలా బాగుంది.
మరి ఇదే అజ్ఞాన వేదిక వారికి ప్రతీ ఊర్లో తరుచుగా కనిపించే స్వస్థత సభలు కనిపించవా? ఆ సభల్లో ప్రార్ధన చేస్తే నిమిషాల్లో కళ్ళు, కాళ్ళు, కడుపులు తెప్పిస్తున్నట్లు నెట్ నిండా బోల్డు వీడియోలు హాల్ చల్ చేస్తున్నాయి.
అలాగే పేరెన్నికగన్న సెలెబ్రిటీ పాస్టర్లు మహిమ నూనెలు, మహిమ రూమాళ్ళు విచ్చల విడిగా అమ్ముకుంటున్నారు.
మరి ఈ అజ్ఞాన వేదిక వారు ఆ స్వస్థత సభల్లో ఇలా మహిమలు ప్రదర్శిస్తున్నారు వాటిని నమ్మకండి. ఆ మీటింగ్స్ వెళ్లి ఆ మహిమలు, నూనెలు, కర్చీఫ్ లు నమ్మి ప్రాణాలు మీదకు తెచ్చుకోకండి అని ఏ నాడైనా ఇలా కర పత్రాలు పంచారా?
నాకు అయితే ఎప్పుడూ ఇలా పంచినట్లు కనపడలేదు.
సో ఏతా వాతా నాకు అర్ధం అయింది ఏమిటంటే…ఒక్క హిందు మతానికి సంబంధించినవి దేవుళ్ళు, పూజలు, పునస్కారాలు, నమ్మకాలు, ఆయుర్వేదం, నాటు వైద్యం మొదలగునవి మాత్రమే మూఢనమ్మకాలని వాటిని పోగొట్టవలసిన బాధ్యత ఈ జన అజ్ఞాన వేదిక వాళ్ళు వాళ్ళ భుజాన వేసుకున్నారు.
అంచేత జనం ఎక్కువగా హాజరయ్యే మహిమలు ప్రదర్శించే స్వస్థత సభల వేదికల నుండి ఈ అజ్ఞాన వేదిక వాళ్ళు ఆనందయ్య మందు వాడకండి అని భవిష్యత్ లో ప్రచారం చేసినా ఆశ్చర్యపోకండి…
-చాడాశాస్త్రి