బోథ్ రెవెన్యూ డివిజన్ కోసం పదవరోజు కార్యాచరణ. రిలే నిరాహార దీక్షలో పదవరోజు బోథ్ కు చెందిన ఫ్రెండ్స్ యూత్ సభ్యులు రిలే దీక్షలో కూర్చున్నారు. బోథ్ మండల ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రంలో భారీ ర్యాలీ. పెద్ద ఎత్తున వంటావార్పు కార్యక్రమం. సంపూర్ణ బోథ్ బంద్ కు పిలుపునిచ్చిన రెవెన్యూ డివిజన్ సాధన సమితి. స్వచ్ఛందంగా బందులో పాల్గొన్న వాణిజ్య, వ్యాపార, వర్తక, ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థల యాజమాన్యాలు. బంద్ లో భాగంగా ఆర్టీసీ బస్సులు నడవక నిర్మానుష్యంగా మారిన బోథ్ బస్టాండ్ ప్రయాణ ప్రాంగణం.