ప్రపంచంలోనే వృద్ధుడు 112 ఏళ్ల సాటర్నిలో డి లా ఫ్యూంటె గార్సియా చనిపోయాడు.
అత్యంత వృద్ధుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కెక్కాడు సాటర్నినో. వాయవ్య స్పెయిన్ లియోన్ లోని తనింటిలో మంగళవారం చనిపోయాడు. జనవరి 18న చనిపోయేనాటికి అతని వయసు.. 112 సంవత్సరాల 341 రోజులు. గత సెప్టెంబర్లోనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా ‘డి లా’ పేరు నమోదు చేసుకున్నాడు. చివరి ఘడియల వరకు ఆరోగ్యంగా తన పనులు తానే చేసుకునేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు.