మహాశివరాత్రి పర్వదినం. భక్తులు పవిత్ర నదులలో స్నానమా చరిస్తుంటారు. హరిద్వార్ లో ఈ సమయంలో కుంభమేళా జరుగుతున్నది. హరిద్వార్ లో జరుగుతున్న కుంభమేళా సమయంలోవచ్చిన మహా శివరాత్రి పర్వదినం రోజు వేలాది మంది నాగ సాధువులు పవిత్ర గంగానదిలో స్నానమాచరించారు . వేలాది మంది భక్తులు కూడా గంగా నది తీరంచేరుకొన్నారు. గడిచిన కొద్ది నెలలుగా కరోనా వైరస్ భారతదేశంలో క్రమంగా బలహీనపడుతున్న వేళ సాధారణ జన జీవనం క్రమంగా సాధారణ స్థితికి చేరుకొంటున్నది , ఈ సమయంలో హరిద్వార్ లో జరుగుతున్న కుంభమేళకు వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం 2.5 మిలియన్ల మంది భక్తులు పవిత్ర గంగానదిలో ఈ రోజు స్నానం చేస్తారని అంచనా.
కరోనా ప్రభావం కారణంగా కుంభం మేళ ఉంటుందో ఉండదో అనే సంశయంలో ఉన్నాను, కుంభమేళ అనుమతించరు, దీని కోసం నేను ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను అని హరిద్వార్ లో రిషబ్ అనే యాత్రికుడు వార్తాపత్రికకు చెప్పాడు భారతదేశం కరోనా మహమ్మారికి అంతగా భయపడటం లేదు భారత దేశ ప్రజలు, ప్రభుత్వం తీసుకున్న తగుజాగ్రత్తలు కారణంగా కరోనా భారత్ లో ఓడిపోయింది , ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు నేను కూడా శివరాత్రి పర్వదినాన గంగానదిలో స్నానం చేయడానికి హరిద్వార్ వచ్చానని 31 సంవత్సరాల నితీష్ కుమార్ AFP వార్తా సంస్థకు చెప్పాడు .
భారతదేశంలో 4 పవిత్ర నదీ తీరాలలో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. అందులో 1]ఉత్తరాఖండ్ లోని హరిద్వార్, ఇది గంగా నదీ తీరంలో ఉంటుంది 2] మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని ఇది క్షిప్రా నదీ తీరంలో ఉంటుంది 3]మహారాష్ట్ర లో నాసిక్, ఇది గోదావరి నది తీరంలో ఉంటుంది 4]ఉత్తర ప్రదేశ్ప్రయాగ , ఇది త్రివేణి సంగమం[గంగా ,యమునా ,సరస్వతీ సంగమస్థలం] తీరంలో ఉంటుంది.
ఎటువంటి ప్రచారం లేకుండానే వేలాది సంవత్సరాల నుండి 12 సంవత్సరాలకి ఒకసారి లక్షలాది మంది భక్తులు కుంభమేళా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈ కుంభమేళాలు భారతీయ సంస్కృతి వారసత్వానికి, ఆధ్యాత్మిక శక్తికిప్రతీకలు. ఈ పవిత్ర నదీ తీరాలలో కుంభమేళా సమయంలో దేశంలోని సాధుసంతులు అందరూ అనేక సత్సాంగులు గోష్ఠి కార్యక్రమాలు నిర్వహిస్తూ హిందూ సమాజానికి మార్గ దర్శనం చేస్తుంటారు. ఎట్టకేలకు యునెస్కో కుంభమేళలు భారతీయ సంస్కృతి క వారసత్వప్రతీకలుగా 2017 లో గుర్తించినది . 2019 వ సంవత్సరం లోప్రయాగలో జరిగిన కుంభమేళాలో 55 మిలియన్ల మంది భక్తులు స్నానం చేశారని నివేదికలు తెలియజేస్తున్నాయి.
ఈ దేశ ప్రజలకు ప్రకృతి ఎడల ఉన్న భక్తి శ్రద్ధలు ప్రకృతిని కాపాడుకోవడంలో ఉన్న నిబద్ధత ఇటువంటి కార్యక్రమాలు మనకు అర్థం చేయిస్తాయి. ప్రకృతితో సహజీవనం భారతీయ జీవన గంగా ప్రవాహం, ఆ ప్రవాహం వేలాది సంవత్సరాలుగా ఈ దేశంలో సాగుతోంది అది ఈ దేశం యొక్క విశిష్టత