సాక్షాత్తూ ఓ మంత్రి రైలెక్కేందుకూ ఒక్కడై పరుగెత్తుతున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆయనెవరో కాదు కర్నాటక విద్యాశాఖమంత్రి బీసీ నగేశ్. ఓ సాధారణ ప్యాసింజర్ లా ఆయన అలా పరుగులు తీయడం చూసి అక్కడున్న ప్రయాణీకులే కాదు వీడియో చూస్తున్నవాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు. ఆసమయంలో ఆయన వెంట ఎలాంటి మందీ మార్బలం లేరు. కనీసం సెక్యూరిటీ కూడా లేరు. ఒక్క గన్ మన్ కూడా లేరు.ఎమ్మెల్యే అయితేనే మామూలు హంగామా ఉండదు.. ఇక అమాత్యులైతే వారు చేసే హడావుడి చెప్పనక్కర్లేదు. అలాంటిది నగేశం అలా సాధారణ ప్రయాణికుడిలా రైలు కోసం వడివడిగా వెళ్తుండడం ఆశ్చర్యమే. నగేశ్ ఆర్ఎస్ఎస్ తీర్చిదిద్దిన నాయకుడని..అందుకే అంత నిరాడంబరత అని అంటున్నారు ఆయన అభిమానులు.