దివంగత కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు ఘన నివాళి అర్పించింది కర్నాటక మిల్క్ ఫెడరేషన్. పాల పాకెట్ల మీద ఆయన ఫొటోను ముద్రించింది. నటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న పునీత్ అనేక సేవా కార్యక్రమాల ద్వారా కన్నడ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.