……………………………….
హైదరాబాద్ షేక్ పేట లో రాష్ట్ర సేవిక సమితి పథ సంచలన్ నిర్వహించింది. భాగ్యనగర్ విభాగ్ లోని వందలాది సేవికలు ఉత్సాహంగా పదం పదం కలుపుతు ముందుకు సాగారు. తీర్చి దిద్దిన గణ వేష్ లు ధరించిన అమ్మాయిలు, క్రమ శిక్షణతో ముందుకు సాగారు. షేక్ పేట లోని వీధి వీధీ కాాషాయ భరితంగా మారింది.
భాగ్యనగర్ లోని వివిధ ప్రాంతాలకు చెందిన సేవికలు ఉత్సాహంగా పథ సంచలన్ లో ముందుకు కదిలారు. శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలకు చెందిన అనేక మంది అమ్మాయిలు సందడి చేశారు. సాంప్రదాయ సంగీతం ప్రతిధ్వనిస్తుంటే, అందుకు అనుగుణంగా శాంతియుతమైన వాతావరణంలో ముందుకు కదిలారు. ఈ సందర్బంగా స్థానికులు జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ సందడి చేశారు.
ఈ పథ సంచలన్ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అమ్మాయిలలో ఐకమత్యం పెరుగుతుంది, ఆత్మ విశ్వాసం బలపడుతుంది. సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొనే పటిష్టత కలుగుతుంది. అంతే గాకుండా భారతదేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకొని వెళ్లేందుకు మేము సైతం అన్న భావన ఏర్పడుతుంది. అందుకే సేవిక సమితి క్రమం తప్పకుండా పథ సంచలన్ నిర్వహిస్తుంది.
రాష్ట్ర సేవిక సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ షేక్ పేట లో మకర సంక్రాంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ అనిత ముఖ్య అతిథిగా విచ్చేశారు. బాలికలు యువతులలో అపారమైన శక్తి నిక్షిప్తమై ఉందని డాక్టర్ అనిత అభిప్రాయపడ్డారు. యోగ వ్యాయామం సామూహిక ప్రదర్శన ద్వారా ఒత్తిడిని జయించవచ్చని, అప్పుడు అంతర్గతంగా ఉన్న శక్తులను పూర్తిగా వినియోగించుకోవచ్చని ఆమె వివరించారు.
…………………………
ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా విచ్చేసిన హైదరాబాద్ బౌద్ధిక్ ప్రముఖ్ నాగశ్రీ శారదాంబ ఉత్తేజ పూరితం గా ప్రసంగించారు. సంఘ్ శతాబ్ది ఉత్సవాలు స్ఫూర్తితో పంచ పరివర్తన మీద దృష్టి సారించాలని కోరారు. ఈ కాలం బాలికలు, యువతులు సమాజం పట్ల అవగాహన పెంచుకోవాలి అని సూచించారు. ఈ క్రమంలో పంచ పరివర్తన వంటి అంశాల గురించి బాగా తెలుసు కోవాలని పేర్కొన్నారు. ఇటువంటి విషయాలను సమాజంలోకి తీసుకోవాలి అని వివరించారు.
………………………………………….
మకర సంక్రాంతి ఉత్సవాలకు స్థానికంగా ఉండే స్వయంసేవకులు సహకారం అందించారు. ఈ కార్యక్రమాన్ని సేవిక సమితి ముఖ్యులు గోవర్ధనం ప్రసన్న లక్ష్మి, పద్మ, రమాదేవి సమన్వయం చేశారు.



