సినిమాస్టార్లు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖుల జీవిత చరిత్రలు తెరకెక్కించడం కొత్తేం కాదు.. ఇప్పడికే బ్యాడ్మింటన్ ఏస్ సైనా నెహ్వాన్ బయోపిక్ విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే మరో షట్లర్ గుత్తా జ్వాలా జీవితం సినిమాగా రానుంది. ఈ విషయాన్ని ఆమె ప్రియుడు, కోలీవుడ్ నటుడు విశాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించాడు. విష్ణు సొంత నిర్మాణ సంస్థ ద్వారానే బయోపిక్ రానుంది.