ది కేరళ స్టోరీ చిత్రబృందం యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిసింది. సినిమాకు పన్నురాయితీ ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది. దర్శక నిర్మాతలు సుదీప్తో సేన్, నిర్మాత విపుల్ షా, నటి ఆదాశర్మ సహా ఇతర నటులు, టెక్నికల్ సిబ్బంది యోగీని కలిశారు. సినిమా చూడాలని కోరారు. . మే 5వతేదీన విడుదలైన ఈ చిత్రాన్ని కేరళ, తమిళనాడు, వెస్ట్ బంగాల్ ప్రభుత్వాలు నిషేధించిన సంగతి తెలిసిందే. యూపీ సహా చాలా రాష్ట్రాలు పన్నురద్దు చేశాయి. శుక్రవారం యూపీ లోక్‌భవన్‌లో జరిగే కేరళ స్టోరీ చిత్రం ప్రత్యేక ప్రదర్శనకు సీఎం ఆదిత్యనాథ్, ఆయన మంత్రివర్గ సహచరులు హాజరుకానున్నారు.
आज लखनऊ स्थित सरकारी आवास पर 'The Kerala Story' फिल्म की टीम के साथ शिष्टाचार भेंट हुई। pic.twitter.com/bfj7sswOTU
— Yogi Adityanath (@myogiadityanath) May 10, 2023