ది కేరళ స్టోరీ విజయవంతంగా ఆడుతోంది. మే 5న రిలీజైన ఈ సినిమా 9వరోజున 100 కోట్ల వసూళ్ల క్లబ్ లో చేరింది. శుక్రవారం 12.35 కోట్లు రాబట్టిన మూవీ… మే 13 శనివారం 19.50 కోట్లతోమొత్తం 112.99కోట్లు రాబట్టింది. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో వందకోట్ల వసూళ్లను దాటిన నాలుగో చిత్రంగా ది కేరళ స్టోరీ రికార్డు సృష్టించిందని విశ్లేషకుల అంచనా.
లవ్ జిహాద్ నేపథ్యంగా తెరకెక్కిన ది కేరళ స్టోరీని ఇస్లామిస్టులు, ఉదారవాదులు, సెక్యులర్ పార్టీలు వ్యతిరేకించాయి. ‘రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ’ కోసమంటూ కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు నిషేధించాయికూడా. దీనిపై చిత్ర నిర్మాతలు సుప్రీంను ఆశ్రయించాయి. ఇన్ని ప్రతిఘటనల మధ్య సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతుండడం విశేషం. మే 12న USA, కెనడా, ఫ్రాన్స్‌లలో విడుదలైంది.
కేరళకు చెందిన షాలిని ఉన్నికృష్ణన్ అనే హిందూ యువతి ముస్లిం యువకుడి ట్రాప్ లో పడి, ఇస్లాంను స్వీకరిస్తుంది. తరువాత ముస్లింను పెళ్లాడి…అతనితో పాటు సిరియా వెళ్లి అక్కడ ఐసిస్ లో చేరుతుంది. అక్కడ ఎలాంటి చిత్రవధ ఎదుర్కొందనేది సినిమాలో చూపించారు.