స్టేట్ యూనివర్సిటీకి వైస్ చాన్సలర్ ను నియమిస్తూ కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది ఆ రాష్ట్రహైకోర్ట్. కేరళ యూనివర్శిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ వైస్ ఛాన్సలర్‌గా డాక్టర్ రిజి జాన్ నియామకాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఈ నియమాకం చట్టవిరుద్ధమని, యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉందని స్పష్టం చేసింది. యూజీసీ నిబంధనలకు అనుగుణంగా కొత్త వైస్ ఛాన్సలర్ నియామకం చేపట్టాల్సిందిగా ఛాన్సలర్ ఆఫ్ యూనివర్శిటీస్‌ను ఆదేశించింది. ప్రస్తుతం ఛాన్సలర్ ఆప్ యూనివర్శిటీస్‌గా గవర్నర్ ఖాన్ ఉన్నారు.
Kerala High Court cancels the appointment of the Vice-Chancellor of Kerala University of Fisheries and Ocean Studies (KUFOS) Dr Riji John. With this, the period from the date of appointment shall be void. The High Court did not accept the government's plea to stay the order. pic.twitter.com/pBFTx0C7Ol
— ANI (@ANI) November 14, 2022
9 యూనివర్సిటీల వీసీల నియామకాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, వారంతా పదవి నుంచి దిగిపోవాలని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆదేశించారు. దీంతో కేరళ యూనివర్సిటీల వ్యవహారంపై ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య వివాదం నడుస్తోంది. ఇందుకు ప్రతిగా …, విశ్వవిద్యాలయాల ఛాన్సలర్‌గా గవర్నర్‌ను తొలగించి ప్రముఖ విద్యావేత్తలను నియమించాలని ప్రతిపాదిస్తూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపొందించింది. దానిపై సంతకం కోసం గవర్నర్ కు పంపింది. అయితే తన అధికారాలను తగ్గిస్తూ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ పై తాను సంతకం చేయబోనని ఆరిఫ్ ఖాన్ అన్నారు. తనకు తానుగా తీర్పు చెప్పుకోలేనని దాన్ని రాష్ట్రప్రతికి పంపుతానని ఆయన తెలిపారు.