కశ్మీర్లో హిందువుల ఊచకోత, తరిమివేత నేపథ్యంగా వివేక్ రంజన్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ది కాశ్మీర్ ఫైల్స్ “బెస్ట్ ఫిల్మ్ ఆన్ హ్యూమన్ రైట్స్ ” గా నిలిచింది. లిఫ్ట్ ఇండియా సంస్థ థియేటర్, పెర్ఫార్మెన్స్ ఆర్ట్, లిటరేచర్, ఫీచర్ ఫిల్మ్, యానిమేటెడ్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించింది. అందులో మానవహక్కులపై ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డును ది కశ్మీర్ ఫైల్ ని ఎంపిక చేశారు. పోర్చుగల్‌కు చెందిన జస్ట్ లెట్ మీ గో ఉత్తమ చలనచిత్రంగా అవార్డు పొందింది. రామ్‌జీ బాలి రూపొందించిన అజ్జో-డాటర్ ఆఫ్ ఇండియా మహిళల హక్కులపై ఉత్తమ చలన చిత్రంగా ఎంపికైంది.
ఈ అవార్డు తన సినిమాకు రావడంపై ట్విట్టర్ వేదిగ్గా సంతోషాన్ని పంచుకున్నారు వివేక్ అగ్నిహోత్రి. ఈ సందర్భంగా దేశప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కశ్మీర్ ఫైల్స్ ప్రజల చిత్రమని ఆయన అన్నారు. తాను వాస్తవాన్ని తెరకెక్కించానని..ఈ అవార్డును ఊచకోతకు గురైన వాళ్లకి, కశ్మీర్‌లోని నాటి బాధితులకు అంకితం ఇస్తున్నట్టు చెప్పారు వివేక్. ఇటీవల అదే సినిమాకు ఇండియన్ టెలివిజన్ అవార్డ్స్ (ITA) ‘గోల్డెన్ ఫిల్మ్ ఆఫ్ ఇండియన్ సినిమా’ అవార్డు ఇచ్చింది.ఈ ‘కాశ్మీర్ ఫైల్స్’ ప్రజల చిత్రం అని అన్నారు.
GOOD NEWS:
Happy to inform that #TheKashmirFiles has been awarded as ‘Best Film on Human Rights’ by #LIIFT2022.
My gratitude to the people of India. pic.twitter.com/qZvhNfgA1e— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) December 29, 2022
దర్శన్ కుమార్, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి , పల్లవి జోషి ప్రధాన పాత్రల్లో నటించిన కాశ్మీర్ ఫైల్స్ రూ. 337.23 కోట్లు వసూలు చేసింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనూ 300 రూపాయల కోట్ల క్లబ్‌ను దాటిన మొదటి హిందీ చిత్రంగా నిలిచింది.
ఈ చిత్రం స్విట్జర్లాండ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కూడా నామినేట్ అయినట్లు సమాచారం. 1989లో ఇస్లామిస్టు జిహాదీల చేతిలో హిందువులు ఎలాంటి హింసను అనుభవించారు, నాటి ఊచకోత, పండిట్ల తరిమివేత నేపథ్యంగా సినిమా తీశారు. లోయలోని మొత్తం 140,000 మంది కాశ్మీరీ పండిట్ నివాసితులలో దాదాపు 100,000 మంది 1989 ఫిబ్రవరి, 1990 మార్చి మధ్య వలస వెళ్లారు. 2011 నాటికి దాదాపు 3,000 కుటుంబాలు మాత్రమే లోయలో మిగిలిపోయాయి.
దర్శన్ పాఠక్, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి , పల్లవి జోషి ప్రధాన పాత్రల్లో నటించిన కాశ్మీర్ ఫైల్స్ రూ. 337.23 కోట్లు వసూలు చేసింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనూ 300 రూపాయల కోట్ల క్లబ్‌ను దాటిన మొదటి హిందీ చిత్రంగా నిలిచింది.