సంచలనం రేపుతున్న ది కశ్మీర్ ఫైల్ సినిమాను అభినందించాడు రాంగోపాల్ వర్మ. అద్భుతచిత్రం. అత్యద్భుత దర్శకత్వ ప్రతిభ అని కొనియాడాడు. ప్రస్తుత, భవిష్యత్ నిర్మాతలు కశ్మీర్ ఫైల్స్ ను చూసి నేర్చుకోవాల్సింది ఉందన్నాడు.
అంతే మూవీ ఒక బెంచ్ మార్క్ అని ప్రశంసిస్తూ… ఇకపై బాలీవుడ్ ను రెండుశకాలుగా విభజించాలని…కశ్మీర్ ఫైల్స్ కు ముందు..కశ్మీర్ ఫైల్స్ కు తరువాత అని ఆయన ట్వీట్ చేశాడు.
https://twitter.com/RGVzoomin/status/1504378675768094722?s=20&t=stPkO1r6uwBJ3oc6d6KK_Q
ఒక్క ట్వీట్ కాదు వరుస ట్వీట్లతో తనదైన శైలిలో అభినందనలు తెలిపాడు వర్మ. తాను disrupter కావచ్చేమో కానీ నువ్వు DESTROYER అని వివేక్ ను ఉద్దేశించి అన్నాడు ఆర్జీవీ.
https://twitter.com/RGVzoomin/status/1504375244395462659?s=20&t=stPkO1r6uwBJ3oc6d6KK_Q
మూవీని బ్లాస్ట్ చేస్తూ వచ్చి… సొంత వివేక్ వుడ్ ను సృష్టించాడనీ అన్నాడు. సత్యాన్ని వెలికితీసే శక్తిమంతమైన సాధనంగా సినిమాను ఎలా ఉపయోగించుకోవచ్చో చెప్పి వివేక్ టార్చ్ బేరర్ అయ్యాడనీ చెప్పుకొచ్చాడు.
https://twitter.com/RGVzoomin/status/1503393345678483458?s=20&t=stPkO1r6uwBJ3oc6d6KK_Q
కత్తి కంటే కలం శక్తిమంతమైనది అనే పాత మాటను తారుమారు చేస్తూ సినిమా.. పెన్ అణచివేత కంటే శక్తివంతమైందని నిరూపించాడని వర్మ మరో ట్వీట్ చేశాడు.
https://twitter.com/RGVzoomin/status/1504030472535306240?s=20&t=stPkO1r6uwBJ3oc6d6KK_Q
ఇక దేశంలోని ప్రతీ ఫిల్మ్ మేకర్, ఆ టీం…తాము తదుపరి సినిమా చేయబోయే ముందు కశ్మీర్ ఫైల్స్ చూసి లోతుగా అధ్యయనం చేయడం తప్ప మరో మార్గం లేదన్నాడు నిజాల్ని వెలికితీయడానికి, స్టోర్ చేయడానికి ఈ మూవీ మంచి సోర్స్ అవుతుందన్న నమ్మకం ఉందని మరో ట్వీట్ చేశాడు వర్మ.
https://twitter.com/RGVzoomin/status/1504032314128363521?s=20&t=stPkO1r6uwBJ3oc6d6KK_Q
వర్మ ఏ విషయాన్నైనా నిర్మొహమాటంగా చెప్పేస్తాడు. అది తన స్టైల్ అంతే. అయితే ఎక్కువగా కాంట్రవర్సీ కామెంట్లు చేసే వర్మ కశ్మీర్ ఫైల్స్ పై చాలా సీరియస్ కామెంట్లు చేయడం చూసి సినీ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. తోటి దర్శకుడిని అభినందించిన వర్మ ఎంతో ఎత్తున నిలిచాడంటూ నెటిజన్లూ స్పందిస్తున్నారు.
వర్మ వరుస ట్వీట్లల్లో ఎక్కువగా ఆకట్టుకుంటున్న ట్వీట్ సాధువులు కశ్మీర్ ఫైల్ చూస్తున్న ఫొటోను జతచేస్తూ చేసిన ట్వీట్.
https://twitter.com/RGVzoomin/status/1504125922437320704?s=20&t=stPkO1r6uwBJ3oc6d6KK_Q
ఈ మూవీ దేశంలోని అన్ని వర్గాల ఆదరాభిమానాలు చూరగొంటోందనడానికి నిదర్శనం ఇది. ఇక పాన్ ఇండియా మూవీగా విడుదలైన రాధేశ్యామ్ ను వెనక్కి నెట్టి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల కనకవర్షం కురిపిస్తోంది ది కశ్మీర్ ఫైల్స్.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)