బీజేపీ చీఫ్ సంజయ్ అరెస్టును ఖండించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగుల తరపున పోరాటానికి తమ అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. బీజేపీని చూసి టీఆర్ఎస్ పార్టీ , ప్రభుత్వం భయపడుతున్నాయన్నాయని అన్నారు. లాఠీలతో, పోలీసు చర్యలతో తమను అణచివేయలేరని… రాజకీయ పార్టీగా ప్రజల తరపున పోరాటాలు చేయడం బీజేపీ బాధ్యత అని కిషన్ రెడ్డి అన్నారు.
కోవిడ్ నిబంధనలు పాటించలేదనే సాకులో కేసుపెట్టి అరెస్ట్ చేశారని…అసలు కోవిడ్ విషయంలో బాధ్యతగా ఎలా ఉండాలో బీజేపీ నాయకులకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు.