చౌరస్తాలో అమెరికా భవిత
ట్రంప్ జమానా ముగిసింది. బైడెన్ రాజ్యం మొదలైంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మరోసారి డెమొక్రాట్ల పాలన ఆరంభమైంది. కరుడుగట్టిన భారత వ్యతిరేకులుగా పేరుపడిన జో బైడెన్, కమలాహ్యారిస్ లు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాతైనా మంచి ఏదో చెడు ఏదో తెలుసుకుంటారేమో చూద్దాం. పాకిస్తాన్ చేసే పాపాలను సమర్థించినట్టు మాట్లాడటం కమలా హ్యారిస్ స్టైల్. కశ్మీర్ పాకిస్తాన్ దే అనే అర్థం వచ్చేలా మాట్లాడటంలో బైడెన్, కమల ఇద్దరూ పోటీ పడుతుంటారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని ఇద్దరూ వ్యతిరేకించారు. కశ్మీర్ కు ఆజాదీ కావాలని ఇద్దరూ వాదిస్తుంటారు.
ఇప్పుడు వైట్ హౌస్ లో పాగా వేశారు. వాస్తవాలను గుర్తించి మసలుకోవాల్సిన బాధ్యతలోఉన్నారు. 78 ఏళ్ల వయసులో బైడెన్ ఎంత చురుగ్గా పనిచేస్తారో చూడాలి. ఆయన వయోభారం వల్ల కమలా హ్యారిస్ రాజ్యమేలుతారనే ప్రచారం నిజమో కాదో తెలియాలి. సిరియా వంటి దేశాల నుంచి కూడా ముస్లింలు అమెరికా ప్రవేశించడంపై ఉన్న ఆంక్షల్ని బైడెన్ ఎత్తివేస్తే అది భస్మాసుర హస్తం లాంటి నిర్ణయం కావచ్చు. సెప్టెంబర్ 11 తరహా దాడులకు ద్వారం తెరిచినట్టు కావచ్చ. అలాగే కశ్మీర్ విషయంలో భారత్ ను వ్యతిరేకించినా, పాక్ ను సమర్థించినా వారి విధులకు ద్రోహం చేసినట్టే. పాక్ కు సైనిక, ఆర్థిక సహాయం చేస్తే ఇక మోడీ ప్రభుత్వం కూడా కరకు వైఖరికి పదును పెట్టాల్సి రావచ్చు. చైనో రాసుకు పూసుకుని తిరిగితే అమెరికా భవిష్యత్తుకే పెను ప్రమాదం. ఇలా, అమెరికా భవిష్యత్తు ఇప్పుడు చౌరస్తాలో ఉంది. ఓటు బ్యాంకు రాజకీయాలను పదవికి సోపానంగా మలచుకున్నారు బైడెన్-హ్యారిస్. వచ్చే నాలుగేళ్లు ఇదే ఒరవడి కొనసాగితే భారతీయులు సహా ఇతర దేశాలకు చెందిన అమెరికన్ పౌరులు, నివాసులు ఆందోళన చెందే పరిస్థితి రావచ్చు. అమెరికాను జీహాదీల డెన్ గా మార్చడానికి బైడెన్ ప్రయత్నిస్తే భారత్ తగిన ప్రతి వ్యూహాన్ని అనుసరించే పరిస్థితి రావచ్చు. కాబట్టి బైడెన్ కే కాదు, ఇది ప్రధాని నరేంద్ర మోడీకి కూడా పరీక్షా సమయమే.